Site icon HashtagU Telugu

PVNR:మాజీ ప్రధానమంత్రి పీవీ సినిమాకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్న ప్ర‌కాశ్ ఝా

Half Lion Web Series

Half Lion Web Series

మాజీ ప్రధాని పివి నరసింహారావుపై హాఫ్ లయన్ పేరుతో బహుభాషా సిరీస్‌కి దర్శకత్వం వహించబోతున్నట్లు చిత్రనిర్మాత ప్రకాష్ ఝా ప్రకటించారు. 2023లో హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానున్న ఈ సిరీస్‌ను మౌంట్ చేయడానికి ఆహా స్టూడియో, అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్ కలిసి వచ్చాయి. గంగాజల్, అపహరన్, రాజనీతి వంటి ప్రశంసలు పొందిన సామాజిక రాజకీయ చిత్రాలకు నాయకత్వం వహించిన ఝా పీవీ న‌ర‌సింహారావు గురించి నేటి తరంలో కొద్ది శాతం మందికి తెలియదని అన్నారు.1991 నుండి 1996 వరకు భారతదేశ ప్రధాన మంత్రిగా పీవీ న‌ర‌సింహారావు పనిచేశారు. ఆయ‌న పదవీకాలంలోనే దేశంలో ప్రధాన ఆర్థిక సంస్కరణలు. డిసెంబర్ 1992లో హిందూ-ముస్లిం అల్లర్లకు దారితీసిన ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో బాబ్రీ మసీదు ధ్వంసం కూడా ఆయ‌న ప‌ద‌వీకాలంలోనే జ‌రిగింది.

దాదాపు 45 సంవత్సరాలు పోరాడిన ఆర్థిక స్వాతంత్ర్యాన్ని భారత దేశానికి అందించార‌ని…ఆయ‌న మ‌న‌ దేశంలో మన రాజకీయాలు, ఆర్థిక వ్యవస్థ, సమాజం, దైనందిన జీవితంలో మార్పులు, వ్యవస్థలను తీసుకువచ్చార‌ని ఝా తెలిపారు. తాను తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణల కోసం ఆయన ఎప్పుడూ క్రెడిట్ తీసుకోలేదని… అప్పటి ఆర్థిక మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్, మాజీ ప్రధానులు పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ, రాజీవ్ గాంధీ మరియు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (INC)కి క్రెడిట్ ఇచ్చారని తెలిపారు. దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఏకైక లక్ష్యంతో పీవీ న‌ర‌సింహారావు ప‌ని చేశారని ఝా అన్నారు.

చరిత్రే కాదు, సొంత పార్టీ, సొంత వాళ్లే ఆయనకు అన్యాయం చేశారు…కానీ ప్రజలు అతనిని గుర్తుపెట్టుకోవడం మొదలుపెట్టి, ఆయ‌న గురించి మాట్లాడటం ప్రారంభించే సమయం వచ్చిందని తెలిపారు. ఆయ‌న‌ కథను చెప్పడంలో మనం కొంత భాగాన్ని కలిగి ఉంటామని తాను ఆశిస్తున్నాన‌ని ఝా తెలిపారు. ఆహా స్టూడియో, అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్ నాలుగు ప్రీమియం ద్విభాషా పాన్-ఇండియన్ సిరీస్‌లను నిర్మిస్తాయని తెలిపారు.పీవీ న‌రసింహారావు క‌థ‌ను తెర‌పైకి తీసుకురావ‌డానికి టీమ్ ఉత్సాహంగా ఉంద‌ని ఆహా ప్ర‌మోట‌ర్ అల్లు అర‌వింద్ అన్నారు. ఈరోజు మనం ఆనందిస్తున్న ఆర్థిక సంస్కరణలన్నీ ఆయన 1991లో ప్రారంభించినవేన‌ని…. ఆ రోజుల్లో ఏం జరిగిందో, ఆ కథనాలను సిరీస్‌తో బయటకు తీసుకురాబోతున్నామ‌ని అరవింద్ చెప్పారు.