Site icon HashtagU Telugu

Soumya Vishwanathan Murder: జర్నలిస్టు సౌమ్య హత్య కేసులో నలుగురు దోషులకు యావజ్జీవ శిక్ష

Soumya Vishwanathan murder

Soumya Vishwanathan murder

Soumya Vishwanathan Murder: టీవీ జర్నలిస్టు సౌమ్య విశ్వనాథన్ హత్య కేసులో నలుగురు దోషులకు ఢిల్లీ కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. సౌమ్య విశ్వనాథన్ హత్య కేసులో రవి కపూర్, అమిత్ శుక్లా, బల్బీర్ మాలిక్ మరియు అజయ్ కుమార్ నిందితులు. వారందరికీ MCOCA చట్టం కింద జీవిత ఖైదు విధించారు. నలుగురు దోషులకు కోర్టు జరిమానా కూడా విధించింది.

2008లో జర్నలిస్టును హత్య చేసిన కేసులో ఐదుగురు నిందితులు ఉన్నారు. 2008లో జర్నలిస్టు సౌమ్య విశ్వనాథన్‌ను కాల్చి చంపారు. ఆ సమయంలో ఆమె తన కారులో ఇంటికి తిరిగి వస్తోంది. ఈ హత్య కేసులో ఐదుగురు నిందితులుగా ఉండగా, వారిలో నలుగురికి తాజాగా జీవిత ఖైదు పడింది. అదనపు సెషన్స్ జడ్జి రవీంద్ర కుమార్ పాండే కోర్టు శిక్షను ఖరారు చేశారు. రవి కపూర్‌కు ఐపీసీ 302 కింద జీవిత ఖైదుతో పాటు రూ. 25 వేలు జరిమానా మరియు లక్ష జరిమానా, బల్జీత్ మాలిక్‌కు ఐపిసి 302 కింద రూ. 25 వేలు జరిమానా, లక్ష జరిమానా, . అమిత్ శుక్లాకు జీవిత ఖైదుతో పాటు ఐపీసీ 302 కింద రూ.25,000 జరిమానా, ఎంసీఓసీఏ కింద లక్ష జరిమానా, అజయ్ కుమార్‌కు ఐపీసీ 302 కింద రూ.25,000 జరిమానా, ఎంసీఓసీఏ కింద రూ.లక్ష జరిమానా విధించారు. మిగతా ఐదో దోషికి రూ.7.25 లక్షల జరిమానా విధించారు. ఐపిసి, ఎంసిఒసిఎ సెక్షన్లు 411 కింద ఐదో దోషి అజయ్ సేథీకి మూడేళ్ల జైలుశిక్షతో పాటు రూ.7.25 లక్షల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది.

Also Read: Rahul Gandhi: నిజామాబాద్‌ లో పోస్టర్ల కలకలం, రాహుల్ రాకను వ్యతిరేకిస్తూ పోస్టర్లు