Site icon HashtagU Telugu

Bharat Jodo Yatra : భారత్ జోడో యాత్రలో పాల్గొననున్న సోనియా, ప్రియాంక గాంధీ

Bharat Jodo Yatra

Bharat Jodo Yatra

రాహుల్ గాంధీ చేస్తున్న భార‌త్ జోడో యాత్ర‌లో కాంగ్రెస్ అధినేత్రి సోనియా, ఆమె కూతురు ప్రియాంక గాంధీ పాల్గొన‌నున్నారు. సెప్టెంబర్ 30వ తేదీన క‌ర్ణాట‌క‌ రాష్ట్రంలోకి ప్రవేశించనున్న భారత్ జోడో యాత్రలో వీరు పాల్గొన‌నున్న‌ట్లు రాష్ట్ర పార్టీ చీఫ్ డి.కె. శివకుమార్ తెలిపారు. భార‌త్ జోడో యాత్ర‌ను విజ‌య‌వంతం చేసేందుకు కర్ణాటక కాంగ్రెస్ సన్నాహాలు చేస్తోందని శివకుమార్ తెలిపారు. ఈ యాత్రపై శుక్రవారం జరిగిన పార్టీ సమీక్షా సమావేశంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కె.సి. వేణుగోపాల్ లో పాటు కర్ణాటక ఇంచార్జ్ రణదీప్ సింగ్ సూర్జేవాలా, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు శివకుమార్, పలువురు నేతలు పాల్గొన్నారు.

సెప్టెంబరు 30న ఉదయం 9 గంటలకు గుండ్లుపేటలో కర్నాటక యాత్ర ప్రారంభమవుతుందని, అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున ఖాదీ, గ్రామోద్యోగ కేంద్రంగా పేరుగాంచిన నంజన్‌గూడు తాలూకాలోని బదనవాలులో కార్యక్రమం ఉందని శివకుమార్ తెలిపారు. దసరాకు రెండు రోజులు సెలవులు ఉంటాయని.. బళ్లారిలో బహిరంగ సభ ఉంటుందని తెలిపారు. మధ్యలో రాహుల్ గాంధీ ప్రతిరోజూ యువత, మహిళలు, ప్రజా సంఘాలు, విద్యార్థులు, గిరిజన సంఘాలు మరియు రైతులతో ఇతరులతో సంభాషిస్తారని తెలిపారు.