Sonia Health : సోనియాకు తీవ్ర అస్వ‌స్థ‌త‌, ఆస్ప‌త్రికి త‌ర‌లింపు

కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్య‌క్షురాలు సోనియాగాంధీ (Sonia Health)అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు.

  • Written By:
  • Updated On - January 4, 2023 / 04:51 PM IST

క‌రోనా నుంచి కోలుకున్న త‌రువాత చ‌లాకీగా క‌నిపిస్తోన్న కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్య‌క్షురాలు సోనియాగాంధీ (Sonia Health) హ‌ఠాత్తుగా అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. ఆమెను ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రికి(Hospital) తీసుకెళ్లారు. సోనియా కూతురు ప్రియాంకా గాంధీ ఆమెతో పాటు ఆసుపత్రికి వెళ్లారు. సాధారణ వైద్య పరీక్షల నిమిత్తమే ఆమె ఆసుపత్రికి వెళ్లారని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక సీనియర్ నేత క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు.  76ఏళ్ల సోనియాగాంధీ శ్వాస (Sonia Health) తీసుకోవడంలో ఇబ్బందితో బాధపడుతున్నారని పీటీఐ మీడియా సంస్థ వెల్లడించింది. మంగ‌ళ‌వారం నుంచి ఆమె ఆరోగ్యం బాగోలేదని ఆ సంస్థ తెలిపింది.

సోనియాగాంధీ హ‌ఠాత్తుగా అస్వ‌స్థ‌త‌ (Sonia Health)

కాంగ్రెస్ పార్టీ యాక్టింగ్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ భార‌త్ జోడో యాత్ర‌కు ఇటీవ‌ల సోనియా హాజ‌ర‌య్యారు. దక్షిణ భార‌త దేశం నుంచి ప్రారంభ‌మైన జోడో యాత్ర ప్ర‌స్తుతం ఉత్త‌ర భార‌త దేశం న‌డిబొడ్డున జ‌రుగుతోంది. ఢిల్లీ కేంద్రంగా జోడో యాత్ర కొన‌సాగుతోంది. ఆమె రెండుసార్లు రాహుల్ యాత్ర‌కు హాజ‌ర‌య్యారు. ఆ సంద‌ర్భంగా సోనియాతో ఆత్మీయంగా తీసుకున్న ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో రాహుల్ షేర్ చేసుకున్నారు. ఆ ఫోటోల‌ను చూసిన కాంగ్రెస్ శ్రేణులు ఎంతో సంతోషించారు. త‌ల్లీ, కుమారుల మ‌ధ్య ఉన్న అనుబంధాన్ని చాటేలా ఫోటోలు ఉండ‌డాన్ని ప్ర‌శంసించారు. అంతేకాదు, ప్రియాంకను కౌగిలించుకున్న ఫోటోల‌ను కూడా ఇటీవ‌ల సోష‌ల్ మీడియా పెట్టారు. సోద‌ర‌భావాన్ని చాటుతూ ఉండే ఆ ఫోటోలు కుటుంబం మ‌ధ్య ఉన్న అనుంబంధాన్ని చాటాయి. వాటిని చూసి. కాంగ్రెస్ క్యాడ‌ర్ సంతోషించింది. హ‌ఠాత్తుగా ఇప్పుడు సోనియాకు శ్వాస తీసుకోవ‌డంలో ఇబ్బందులు రావ‌డంతో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళ‌న చెందుతున్నారు.

అనారోగ్యం గురించి అధికారికంగా ధ్రువీక‌రించ‌డంలేదు

మంగ‌ళ‌వారం సాయంత్రం రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఉత్తరప్రదేశ్ లోకి ప్రవేశించింది. తమ తల్లికి ఆరోగ్యం బాగోలేదనే విషయం తెలిసిన వెంటనే రాహుల్, ప్రియాంక ఢిల్లీకి వచ్చారు. సోనియా అనారోగ్యంపై కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందిస్తూ, ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. సోనియా అనారోగ్యంపాలయ్యారనే వార్తను వినడం బాధాకరమని చెప్పారు. ఆమె గ‌త కొంత కాలంగా ఆనారోగ్యంతో బాధ ప‌డుతున్నారు. అమెరికా వెళ్లి ఆమె చికిత్స తీసుకున్నారు. స‌ర్వేక‌ల్ క్యాన్స‌ర్ తో బాధ‌ప‌డుతున్న‌ట్టు అప్ప‌ట్లో వార్త‌లు వ‌చ్చాయి. అమెరికాలోని డాక్ట‌ర్ నూరి ద‌త్తాత్రేయ వ‌ద్ద ట్రీట్మెంట్(Hospital) త‌రువాత ఆమె కోలుకున్నారు. గ‌త మూడేళ్లుగా అప్పుడ‌ప్పుడు ఆస్ప‌త్రుల్లో చెకింగ్ కు వెళుతున్నారు. క‌రోనా కూడా రెండుసార్లు ఆమెకు సోకింది. ఇప్పుడు ఆక‌స్మాత్తుగా
శ్వాస స‌మ‌స్య వ‌చ్చింద‌ని తెలుస్తోంది.

Also Read : Sonia and Rahul: ఢిల్లీకి భారత్ జోడో యాత్ర.. సోనియా, రాహుల్ భావోద్వేగం!

ఆమె అనారోగ్యం గురించి అధికారికంగా కాంగ్రెస్ నేత‌లు ఎవ‌రూ ధ్రువీక‌రించ‌డంలేదు. అయితే, కొంద‌రు మాత్రం ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు. గాంధీ కుటుంబంతో స‌న్నిహితంగా ఉండే వాళ్ల‌కు మాత్రం ఆమె అనారోగ్యం గురించి స‌మాచారం ఉంద‌ని అంటున్నారు. ఆమె కోలుకోవాల‌ని కాంగ్రెస్ శ్రేణులు దేశ వ్యాప్తంగా ప్రార్థ‌న‌లు చేస్తున్నారు.

Also Read : XBB15 Cases: బీ అలర్ట్.. తెలంగాణలో కరోనా ‘ఎక్స్ బీబీ15’ కేసులు