కేరళలోని వయనాడ్ ఉపఎన్నిక (Wayanad by-election) బరిలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ (Priyanka Gandhi) బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. అంతకు ముందు జరిగిన లోక్ సభ ఎన్నికల్లో (Lok Sabha elections) రాహుల్ గాంధీ (Rahul Gandhi).. వయనాడ్ తో పాటు రాయ్ బరేలి లలో పోటీ చేసి రెండో చోట్ల విజయం సాధించారు. కానీ ఈ రెండు చోట్ల నుండి ఏదొక స్థానం వదులుకోవాల్సి రావడం ఆయన వయనాడ్ స్థానాన్ని వదులుకున్నారు. దీంతో ఇప్పుడు ఎక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇక ఈ ఉప ఎన్నికకు గాను బిజెపి నవ్య హరిదాస్ (Navya Haridas) ను బరిలోకి దింపగా..కాంగ్రెస్ ప్రియాంక ను దించింది.
ప్రత్యక్ష రాజకీయాల్లో అరంగేట్రం చేయబోతున్న తన కూతురు ప్రియాంక కోసం పార్టీ మాజీ చీఫ్ సోనియా గాంధీ ప్రచారం (Sonia Gandhi Campaign) చేయనున్నారు. అక్టోబర్ 22న జరిగే రోడ్ షోలో రాహుల్, ప్రియాంకతో కలిసి ఆమె పాల్గొంటారు. కాగా కేరళలోని పాలక్కాడ్, చెలక్కర అసెంబ్లీ స్థానాలకు, అలాగే వయనాడ్ పార్లమెంట్ స్థానానికి నవంబర్ 13న పోలింగ్ జరుగుతుంది. 23వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఈ ఉపఎన్నికలు కాంగ్రెస్ పార్టీలోని కీలక నాయకత్వ మార్పులను ప్రతిబింబించే అవకాశాలు ఉండటంతో, రాజకీయ పర్యవేక్షకులు దీనిపై ఆసక్తిగా ఉన్నారు.
కేరళలోని వయనాడ్ జిల్లాలో జరుగుతున్న రాజకీయ పోటీలో పలు స్థానిక అంశాలు, అభివృద్ధి పనులు, వ్యవసాయ సమస్యలు, యువతకు అవకాశాలు, మహిళా సాధికారత వంటి అంశాలు కీలకంగా మారవచ్చు. ప్రియాంకా గాంధీ ఈ అంశాలను తన ప్రచారంలో ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా ప్రజల మద్దతు పొందే ఛాన్స్ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఈ ఉపఎన్నికలను వ్యూహాత్మకంగా ఉపయోగించుకుని, జాతీయ స్థాయిలో తమ శక్తిని మళ్ళీ పునరుద్ధరించుకోవాలని చూస్తుంది. ఇది 2024 లో జరుగనున్న సాధారణ ఎన్నికలకు ముందుగా పార్టీని మరింత బలంగా నిలబెట్టడం కోసం ఒక అవకాశమని భావిస్తున్నారు.
Read Also : UPI In Maldives: మాల్దీవులలో ఇకపై ఇండియా యూపీఐ పేమెంట్స్..