Site icon HashtagU Telugu

Sonia Gandhi : అగ్నిప‌థ్ పై ఆస్ప‌త్రి నుంచి సోనియా అప్పీల్‌

Sonia Gandhi

Sonia Gandhi Congress

అగ్నిప‌థ్ ను వ్య‌తిరేకిస్తున్న ఆందోళ‌నకారుల‌కు మ‌ద్ధ‌తుగా కాంగ్రెస్ పార్టీ నిలుస్తుంద‌ని ఆస్ప‌త్రిలో కోవిడ్ చికిత్స పొందుతోన్న ఏఐసీసీ అధ్య‌క్షురాలు సోనియాగాంధీ హామీ ఇచ్చారు. అహింసా మార్గంలో ఈ ప‌థ‌కాన్ని వ్య‌తిరేకిస్తూ పోరాడాదాం అంటూ హిందీలో ట్వీట్ చేశారు. “ఈ పథకానికి వ్యతిరేకంగా మీ ప్రయోజనాలను పరిరక్షిస్తామనే మా వాగ్దానానికి భారత జాతీయ కాంగ్రెస్ గట్టిగా నిలుస్తుంది.

అగ్నిపథ్‌కి వ్యతిరేకంగా ఇప్పుడు ఎనిమిది రాష్ట్రాలకు విస్తరిస్తున్న నిరసనలను గ‌మ‌నించిన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ మిలటరీ ఉద్యోగ ఆకాంక్షలకు అండ‌గా నిలిచారు. వివాదాస్పద పథకాన్ని ఉపసంహరించుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నంలో కాంగ్రెస్ “బలంగా నిలబడతుంద‌ని హామీ ఇచ్చారు. ఆర్మీ ఉద్యోగాలను ఆశించేవారి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకోకుండా ఈ ప‌థ‌కాన్ని మోడీ సర్కార్ ప్ర‌క‌టించింద‌ని కాంగ్రెస్ చీఫ్ హిందీలో ఒక ప్రకటనలో తెలిపారు.

యువకుల డిమాండ్‌ను ప్రధాని నరేంద్ర మోదీ అంగీకరించాలని, వ్యవసాయ చట్టాల మాదిరిగానే రక్షణ నియామక పథకాన్ని ఉపసంహరించుకోవాలని రాహుల్ గాంధీ, సోనియా డిమాండ్ చేశారు. ‘నల్ల వ్యవసాయ చట్టాలను ప్రధాని ఉపసంహరించుకోవాలని నేను ఇంతకుముందు కూడా చెప్పాను’ అని హిందీలో చేసిన ట్వీట్‌లో గాంధీ అన్నారు. “అదే విధంగా, అతను ‘మాఫీవీర్’గా మారడం ద్వారా దేశంలోని యువత డిమాండ్‌ను అంగీకరించాలి ‘అగ్నిపథ్’ పథకాన్ని వెనక్కి తీసుకోవాలి,” అని ఆయన అన్నారు.

ఈ పథకం “వివాదాస్పదమైనది, బహుళ నష్టాలను కలిగి ఉందని, దీర్ఘకాల సంప్రదాయాలను తారుమారు చేస్తుందని ఆరోపించారు.

Exit mobile version