Site icon HashtagU Telugu

Sonia Gandhi Vs PM Modi : ప్రధానికి సోనియాగాంధీ ప్రశ్నాస్త్రాలు.. పార్లమెంట్ స్పెషల్ సెషన్ పై నిలదీత

Sonia Gandhi Vs Pm Modi

Sonia Gandhi Vs Pm Modi

Sonia Gandhi Vs PM Modi : ఈనెల 18 నుంచి 22 వరకు జరగనున్న పార్లమెంట్ స్పెషల్ సెషన్స్ పై ప్రశ్నలు సంధిస్తూ, సందేహాలు లేవనెత్తుతూ  ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ లేఖ రాశారు.   ప్రత్యేక సమావేశాల ఎజెండా ఏమిటో స్పష్టంగా చెప్పాలని నిలదీశారు. ఇతర పార్టీలతో అస్సలు చర్చించకుండానే ప్రత్యేక సమావేశాలు నిర్వహించడం ఏమిటని  ప్రశ్నించారు. ఎందుకింత అకస్మాత్తుగా సమావేశాలు పెడుతున్నారనే దానిపై దేశానికి క్లారిటీ ఇవ్వాలన్నారు. ఏదిఏమైనప్పటికీ సమావేశాల్లో ప్రస్తావనకు వచ్చే కీలక అంశాలపై చర్చించేందుకు తమకు సమయం కేటాయించాలని కోరారు.  ప్రధాని మోడీకి రాసిన లేఖలో 9 అంశాలను సోనియా (Sonia Gandhi Vs PM Modi)  ప్రస్తావించారు.

Also read : Digital Rupee: ఎస్‌బీఐ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. యూపీఐతో ఆ పేమెంట్స్ కూడా..!

సోనియా గాంధీ లేఖలోని 9 అంశాలివీ.. 

1. పెరుగుతున్న నిత్యావసరాల ధరలు, పెరుగుతున్న నిరుద్యోగం, పెరుగుతున్న  అసమానతలు, పెరుగుతున్న MSMEల బాధలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించాలి.

2. రైతులకు కనీస మద్దతు ధర, వారు లేవనెత్తిన ఇతర డిమాండ్లను నెరవేర్చడానికి కేంద్ర సర్కారు చొరవ చూపాలి.

3. అదానీ బిజినెస్ గ్రూప్  లావాదేవీలపై  దర్యాప్తునకు జాయింట్  పార్లమెంటరీ కమిటీ వేయాలి.

4. మణిపూర్ ప్రజలు ఎదుర్కొంటున్న వేదనను తీర్చడంపై ఫోకస్ చేయాలి.   ఆ రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగాన్ని నిలబెట్టి, సామాజిక సామరస్యం ఉండేలా చూడాలి.

5. హర్యానా సహా పలు రాష్ట్రాల్లో మతపరమైన ఉద్రిక్తతలు పెరిగాయి. అక్కడ శాంతిభద్రతలను స్థాపించాలి.

6. లడఖ్, అరుణాచల్ ప్రదేశ్‌ లలోని భారత సరిహద్దుల్లో చైనా ఆగడాలకు అడ్డుకట్ట వేయాలి.

7. కుల గణన తక్షణం చేపట్టాలి.

8. కేంద్ర, రాష్ట్ర సంబంధాలను బలోపేతం చేయాలి.

9. వరదలు, కరువుతో అల్లాడుతున్న రాష్ట్రాలను ఆదుకోవాలి. సహాయక చర్యలు చేపట్టాలి.