Ayodhya Ram Mandir : అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి సోనియాగాంధీ ?

Ayodhya Ram Mandir : జనవరి 22న అయోధ్య రామమందిరంలో భగవాన్ శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠా మహోత్సవం ఘనంగా జరగనుంది.

Published By: HashtagU Telugu Desk
Sonia Gandhi

Sonia Gandhi Congress

Ayodhya Ram Mandir : జనవరి 22న అయోధ్య రామమందిరంలో భగవాన్ శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠా మహోత్సవం ఘనంగా జరగనుంది. అట్టహాసంగా జరిగే ఈ వేడుకకు కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ హాజరవుతారా ? లేదా ? అనే దానిపై ఇప్పటిదాకా సస్పెన్స్ నెలకొంది. ఈతరుణంలో శుక్రవారం మధ్యాహ్నం కాంగ్రెస్ పార్టీ వర్గాల నుంచి కీలక ప్రకటన వెలువడింది. జనవరి 22న అయోధ్య రామమందిరంలో జరిగే కార్యక్రమానికి సోనియా గాంధీ హాజరయ్యే అవకాశం ఉందని వెల్లడించారు. అయితే ఈ  అంశంపై..  ఇండియా కూటమిలోని కీలక రాజకీయ పక్షాలతో చర్చించిన తర్వాత  కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంటుందని ఇంకొందరు అంటున్నారు. ఒకవేళ అయోధ్య రామమందిర కార్యక్రమానికి కాంగ్రెస్ నుంచి ఎవరూ హాజరుకాకుంటే.. వచ్చే ఎన్నికల్లో ఇండియా కూటమిపై దాడి చేయడానికి బీజేపీ చేతికి మరో పెద్ద ఆయుధాన్ని ఇచ్చినట్టుగా అవుతుందని కాంగ్రెస్‌లోని ఓ వర్గం నేతలు అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది.

We’re now on WhatsApp. Click to Join.

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేత అధిర్ రంజన్ చౌదరి కూడా అయోధ్యకు వెళ్తారని తెలుస్తోంది. అయితే ఖర్గే, అధిర్ రంజన్‌ల షెడ్యూల్‌పై ఇంకా క్లారిటీ రాలేదు. తాము అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి వెళ్లడం లేదని సీపీఎం, సీపీఐ పార్టీలు ఇప్పటికే ప్రకటించాయి. జనవరి 22న జరిగే కార్యక్రమాన్ని బీజేపీ రాజకీయ చేస్తోందని ఆ పార్టీలు విమర్శించాయి. మాజీ కాంగ్రెస్ నేత, స్వతంత్ర రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ ఇటీవల మాట్లాడుతూ.. ‘‘నా హృదయంలోనే రాముడు ఉన్నాడు. నేను అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి వెళ్లి రాజకీయం చేయదల్చుకోలేదు. ఆ కార్యక్రమాన్ని రాజకీయం కోసమే బీజేపీ వాడుకుంటోంది’’ అని వ్యాఖ్యానించారు. 

Also Read: Navy – Chattrapati Shivaji : ఛత్రపతి శివాజీ స్ఫూర్తితో నేవీ అడ్మిరల్స్ భుజకీర్తులు

జనవరి 22న జరిగే అయోధ్య రామమందిర ప్రారంభోత్సవంలో(Ayodhya Ram Mandir) ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు ప్రముఖ క్రికెటర్లు, పారిశ్రామికవేత్తలు, సాధువులు, వివిధ దేశాల ప్రతినిధులు హాజరుకానున్నారు. ఈజాబితాలో అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, ముఖేష్ అంబానీ, రతన్ టాటా, సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లి, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా ఉన్నారు.

  Last Updated: 29 Dec 2023, 03:22 PM IST