Site icon HashtagU Telugu

Sonia Gandhi: తొలిసారిగా రాజ్యసభకు సోనియా గాంధీ నామినేష‌న్ దాఖ‌లు

Sonia Gandhi Nomination For Rajya Sabha For The First Time

Sonia Gandhi Nomination For Rajya Sabha For The First Time

Sonia Gandhi: కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ(Sonia Gandhi) తొలిసారిగా రాజ్యసభలో అడుగుపెట్టనున్నారు. రాజస్థాన్‌ నుంచి రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆమె జైపుర్‌లో నామినేషన్‌ దాఖలు చేశారు. సోనియా వెంట ఆమె కుమారుడు రాహుల్‌ గాంధీ, కుమార్తె ప్రియాంక గాంధీ, ఇతర నేతలు ఉన్నారు. సోనియా గాంధీతో పాటు మరో మూడు స్థానాల అభ్యర్థుల జాబితాను విడుదల కాంగ్రెస్(congress) విడుదల చేసింది. అందులో రాజస్థాన్‌ నుంచి మాజీ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, బిహార్‌, హిమాచల్‌ప్రదేశ్‌, మహారాష్ట్ర నుంచి అఖిలేష్ ప్రసాద్ సింగ్,అభిషేక్ మను సింఘ్వి, చంద్రకాంత్ హండేరే పేర్లను ప్రకటించింది.

కాగా, రాజస్థాన్ నుంచి సోనియా గాంధీ రాజ్యసభ ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ఈ నేపథ్యంలో, ఢిల్లీ నుంచి సోనియా రాజస్థాన్ రాజధాని జైపూర్(Jaipur)కు చేరుకున్నారు. ఆమెతో పాటు రాహుల్, ప్రియాంకా గాంధీలు ఉన్నారు. ఈరోజు సోనియా నామినేషన్ (Nomination)దాఖలు చేశారు. నామినేషన్లు సమర్పించడానికి రేపు చివరి తేదీ. 27న ఎన్నికలు జరుగుతాయి.

We’re now on WhatsApp. Click to Join.

ఐదు సార్లు లోక్ సభ(Lok Sabha)కు ఎన్నికైన 77 ఏళ్ల సోనియాగాంధీ తొలిసారి రాజ్యసభ(Rajya Sabha)లో అడుగుపెట్టబోతున్నారు. ప్రస్తుతం ఆమె ఉత్తరప్రదేశ్ లోని రాయ్ బరేలీ నుంచి లోక్ సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో రాయ్ బరేలీ నుంచి ఆమె కుమార్తె ప్రియాంకాగాంధీ(Priyanka Gandhi) పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని విశ్వసనీయంగా తెలుస్తోంది.

read also : Valantines day Special : చైతు – సాయి పల్లవిల ‘వాలంటైన్స్ డే’ రీల్‌కు ఫిదా అవ్వాల్సిందే..