Site icon HashtagU Telugu

Lok Sabha Elections 2024: నా కొడుకును మీకు అప్పగిస్తున్నాను: సోనియా గాంధీ

Lok Sabha Elections 2024

Lok Sabha Elections 2024

Lok Sabha Elections 2024: రాయ్‌బరేలీలో నిర్వహించిన ర్యాలీలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. తన కొడుకు రాహుల్ గాంధీనీ రాయ్‌బరేలీ ప్రజలకు అప్పగిస్తున్నామని సోనియా భావోద్వేగానికి గురయ్యారు. తమ కుటుంబ మూలాలు రాయ్‌బరేలీ మట్టితో ముడిపడి ఉన్నాయని ఆమె చెప్పారు. అందుకే రాహుల్ గాంధీని మీకు అప్పగిస్తున్నానని అంటూ సోనియా గాంధీ ఎమోషనల్ అయ్యారు.

రాయ్‌బరేలీలో నిర్వహించిన ర్యాలీలో సోనియా గాంధీ మాట్లాడుతూ.. గంగామాత వలె పవిత్రమైన ఈ సంబంధం అవధ్ మరియు రాయ్ బరేలీ రైతుల ఉద్యమంతో ప్రారంభమై నేటికీ కొనసాగుతోంది. మాజీ ప్రధాని ఇందిరాగాంధీని స్మరించుకుంటూ.. ఇందిరాజీ గుండెల్లో రాయ్‌బరేలీకి ప్రత్యేక స్థానం ఉందని, ఆమె దగ్గరుండి పనిచేయడం చూశాను. ఆమెకు మీ మీద అపారమైన అభిమానం ఉండేదని సోనియా చెప్పారు.

ఇందిరాజీ మరియు రాయ్‌బరేలీ ప్రజలు నాకు అందించిన విద్యనే నేను రాహుల్, ప్రియాంకలకు అందించాను. ప్రతి ఒక్కరినీ గౌరవించండి… బలహీనులను రక్షించండి… అన్యాయానికి వ్యతిరేకంగా ప్రజల హక్కుల కోసం పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నా కొడుకును మీకు అప్పగిస్తున్నానని చెప్పింది. నన్ను మీ స్వంతంగా అంగీకరించినట్లే, రాహుల్‌ను మీ స్వంతంగా అంగీకరించాలి అని ఓటర్లను కోరారు.

Also Read: Swati Maliwal Assault: కేజ్రీవాల్ ఇంటికి చేరుకున్న ఫోరెన్సిక్ బృందం