Site icon HashtagU Telugu

Sonia Gandhi: రాయ్‌బరేలీ నియోజకవర్గ ప్రజలకు సోనియా గాంధీ భావోద్వేగ లేఖ

Sonia Gandhi Emotional Letter To The People Of Rae Bareli Constituency

Sonia Gandhi Emotional Letter To The People Of Rae Bareli Constituency

 

Emotional-Mmessage రాజ్యసభకు నిన్నఏఐసీసీ అగ్రనాయకురాలు సోనియా గాంధీ(Sonia Gandhi) నామినేషన్ వేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె ఈరోజు రాయ్‌బరేలీ(rae bareli) నియోజకవర్గ ప్రజలకు భావోద్వేగ లేఖ రాశారు. 1999 నుంచి లోక్ సభకు పోటీ చేస్తూ వస్తోన్న ఆమె ఈసారి పార్లమెంట్ ఎన్నికల బరిలో నుంచి తప్పుకోవాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో సుదీర్ఘకాలం రాయ్‌బరేలీ లోక్ సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఉన్న ఆమె తన నియోజకవర్గ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. రాయ్‌బరేలీ ప్రజలకు ఆమె గురువారం ధన్యవాదాలు తెలిపారు.

ఆరోగ్య సమస్యల(Health problems)కారణంగా లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయలేకపోతున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నారు. 2004 నుంచి సోనియా గాంధీ ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అయితే తన తర్వాత ఇదే నియోజకవర్గం నుంచి తమ కుటుంబంలోని వారే పోటీ చేసే అవకాశాలు ఉన్నట్లు ఆమె హింట్ ఇచ్చారు. ఆమె హిందీలో నియోజకవర్గ ప్రజలకు లేఖ రాశారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ రోజు నేను ఏ స్థాయిలో ఉన్నా దానికి మీరే కారణమని గర్వంగా చెప్పగలనని రాయ్‌బరేలీ నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి పేర్కొన్నారు. మీ నమ్మకాన్ని నిలబెట్టేందుకు నేను నా వంతు కృషి చేశానని పేర్కొన్నారు. అనారోగ్యం, వయస్సు సమస్యల కారణంగా రానున్న లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయనని ఆమె పేర్కొన్నారు. తాను పోటీ చేయని కారణంగా నేరుగా మీకు సేవ చేసే అవకాశం ఉండదు.. కానీ నా హృదయం, ఆత్మ ఎల్లప్పుడూ మీతోనే ఉంటాయన్నారు. గతంలో మాదిరిగానే భవిష్యత్తులోనూ మీరు నాకు, నా కుటుంబానికి అండగా ఉంటారని ఆశిస్తున్నానని పేర్కొన్నారు.

read also : Chiranjeevi : చిరంజీవిని గెలిపించే బాధ్యత మాదే అంటున్న చింతామోహన్‌