Sonia Gandhi: రాజస్థాన్ నుంచి రాజ్యసభకు సోనియా గాంధీ ఏకగ్రీవం

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. భారతీయ జనతా పార్టీకి చెందిన చున్నిలాల్ గరాసియా, మదన్ రాథోడ్ కూడా రాష్ట్రం నుంచి ఎగువ సభకు ఏకగ్రీవంగా

Sonia Gandhi: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. భారతీయ జనతా పార్టీకి చెందిన చున్నిలాల్ గరాసియా, మదన్ రాథోడ్ కూడా రాష్ట్రం నుంచి ఎగువ సభకు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అసెంబ్లీ కార్యదర్శి మహావీర్ ప్రసాద్ శర్మ తెలిపారు. నామినేషన్ల ఉపసంహరణకు మంగళవారం చివరి రోజు. ఇతర అభ్యర్థులు ఎవరూ పోటీ చేయకపోవడంతో ముగ్గురు నేతలు ఏకగ్రీవంగా రాజ్యసభకు ఎన్నికైనట్లు అధికారి తెలిపారు.

ఐదు పర్యాయాలు లోక్‌సభ ఎంపీగా పనిచేసిన 77 ఏళ్ళ సోనియా గాంధీ ఎగువ సభలోకి ప్రవేశించడం ఇదే తొలిసారి. కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత 1999లో తొలిసారిగా ఎంపీగా ఎన్నికయ్యారు ఆమె.ఆగస్టు 1964 నుండి ఫిబ్రవరి 1967 వరకు ఎగువ సభలో సభ్యునిగా ఉన్న మాజీ ప్రధాని ఇందిరా గాంధీ తర్వాత రాజ్యసభలో ప్రవేశించిన గాంధీ కుటుంబంలో రెండవ సభ్యురాలు ఈమె కావడం విశేషం.

15 రాష్ట్రాలకు చెందిన మొత్తం 56 మంది రాజ్యసభ సభ్యులు ఏప్రిల్‌లో పదవీ విరమణ చేయనున్నారు. ఫిబ్రవరి 27న ఖాళీ అయిన ఈ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. నామినేషన్ల దాఖలుకు ఫిబ్రవరి 15న గడువు ముగిసింది. రాజ్యసభ సభ్యులు మన్మోహన్ సింగ్ (కాంగ్రెస్), భూపేంద్ర యాదవ్ (బిజెపి) పదవీకాలం ఏప్రిల్ 3తో ముగుస్తుంది. బిజెపి ఎంపి కిరోడి లాల్ మీనా డిసెంబరులో ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత సభకు రాజీనామా చేయడంతో మూడవ స్థానం ఖాళీ అయింది. 200 మంది సభ్యులున్న అసెంబ్లీలో బీజేపీకి 115 మంది, కాంగ్రెస్‌కు 70 మంది సభ్యులున్నారు. రాజస్థాన్‌లో 10 రాజ్యసభ స్థానాలు ఉన్నాయి. ఫలితాల అనంతరం కాంగ్రెస్‌కు ఆరుగురు, బీజేపీకి నలుగురు సభ్యులు ఉన్నారు.

Also Read: Amit Shah: పార్లమెంట్ ఎన్నికలపై బీజేపీ ఫోకస్, తెలంగాణకు అమిత్ షా రాక