Site icon HashtagU Telugu

Sonia Gandhi Dance: మహిళా రైతులతో సోనియా డాన్స్.. వైరల్ అవుతున్న వీడియో

Soniay Gandhi

Soniay Gandhi

వయసు మీద పడుతున్నా ఉరకలేసే ఉత్సాహంతో సోనియాగాంధీ ముందుకు సాగుతోంది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ను అధికారం కట్టబెట్టేందుకు తెర వెనుక వ్యూహాలు రచిస్తోంది. అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నా ఇంటికే పరిమితం కాకుండా ప్రత్యక్ష్య రాజకీయాల్లోనూ భాగమవుతున్నారు. తాజాగా సోనియా గాంధీ హరియాణా మహిళా రైతులతో కలిసి డ్యాన్స్ వేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవల హర్యానాలో రాహుల్ గాంధీ (Rahul Gandhi)తో మహిళా రైతులు డ్యాన్స్ చేశారు. ఇప్పుడు ఆ రైతులతోనే సోనియా గాంధీతో డ్యాన్స్ (Sonia Gandhi) చేసి కాంగ్రెస్ నేతల్లో జోష్ నింపింది.

ఇటీవల రాహుల్ హర్యానాలో పర్యటించి, మహిళా రైతులు మాట్లాడారు. అయితే ఢిల్లీతో పాటు, రాహుల్ ఇంటిని చూడడానికి వస్తామని ఆ మహిళా రైతులు కోరారు. దీంతో తనను లోక్‌సభకు అనర్హుడిగా పర్యటించాక ఢిల్లీలోని తన నివాసాన్ని ప్రభుత్వం తీసేసుకుందని ఆ రైతులకు రాహుల్ చెప్పాడు. అయితే సోనియా గాంధీ(Sonia Gandhi) తమ ఇంటికి లంచ్ కు ఆ మహిళా రైతులను ఆహ్వానించారు. వారికి ప్రయాణ సౌకర్యాలను కూడా కల్పించారు. ఆ సందర్భంగా సోనియా గాంధీ ఆ మహిళా రైతులతో కలిసి డ్యాన్స్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియోను కాంగ్రెస్ నేతలు షేర్ చేయగా అదికాస్తా సోషల్ మీడియాలో వైరల్(Video Viral) అవుతోంది.

ఇక 2024 లోక్ సభ ఎన్నికల కోసం అధికార, విపక్ష కూటముల ఏర్పాటు ప్రయత్నాలు స్పీడప్ అయ్యాయి.  ఈక్రమంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి, కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్ష కూటమి బల ప్రదర్శనకు రెడీ అయ్యాయి. ప్రాంతీయ సమీకరణాలు, పరస్పర రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా తమకు మద్దతునిచ్చే పార్టీలతో ఆయా కూటములు ఏకకాలంలో భేటీ కాబోతున్నాయి. సోమ, మంగళవారాల్లో (నేడు, రేపు) బెంగళూరు వేదికగా 24 విపక్ష పార్టీలు సమావేశం కాబోతుండగా.. మంగళవారం (జులై 18న) ఢిల్లీ వేదికగా దాదాపు 30 పార్టీల మద్దతు కలిగిన ఎన్డీఏ (NDA) కూటమి భేటీ జరగబోతోంది.