Site icon HashtagU Telugu

Sonia Gandhi : ఆందోళనకరంగా సోనియాగాంధీ ఆరోగ్యం…ఎంపీ జైరాం రమేశ్ ప్రకటన..!!

Sonia Gandhi

Sonia Gandhi Congress

కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఆరోగ్యపరిస్థితి ఆందోళనకరంగా మారింది. కోవిడ్ అనంతరం ఆమె ఆరోగ్యం క్షీణించింది. తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పార్టీ కీలక నాయకుడు…ఏఐసీసీ సభ్యుడు ఎంపీ జైరాం రమేశ్ ఓ ప్రకటన విడుదల చేశారు. అనారోగ్య పరిస్థితి తీవ్రతరం కావడంతో ఈనెల 12న సోనియాగాంధీని ఢిల్లీలోని గంగారామ్ ఆసుపత్రిలో చేర్పించినట్లు తెలిపారు. అయితే అక్కడ కొన్ని రోజులు ఆరోగ్యం నిలకడగానే ఉన్నా…శుక్రవారం నాటికి క్షీణించినట్లు ఆయన తెలిపారు.

సోనియా ముక్కు నుంచి రక్తం కారుతోందని తెలిపారు. గతేడాది కోవిడ్ బారినపడ్డ సోనియా…కొన్నాళ్లకు కోలుకున్నారు. అయితే ఈ మధ్యే కోవిడ్ అనంతర ఇన్ఫెక్షన్ సోకిందని..దీంతో అనారోగ్యానికి గురయ్యారని జైరాం రమేశ్ వివరించారు. గురువారం ఉదయం వరకు నిలకడగానే ఉన్న ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించిందని తెలిపారు. లోయర్ రెస్పిరేటరీ ఫంగర్ ఇన్ఫెక్షన్ కు గురైనట్లు చెప్పారు. ప్రస్తుతం సోనియాకు అత్యవసర చికిత్స అందిస్తున్నట్లు వివరించారు.

ఇక కాంగ్రెస్ శ్రేణులంతా ధైర్యంగా ఉండాలని ట్వీట్ చేశారు జైరాం రమేశ్. సోనియా కోసం ప్రార్థనలు చేయాలని పిలుపునిచ్చారు. దేశ ప్రజల కోసం…తన జీవితాన్ని త్యాగం చేశారని…సోనియా ఆరోగ్యంగా తిరిగివస్తారని ఆకాంక్షించారు. ఇక ఈ మధ్యే రాజస్థాన్ తో నిర్వహించిన చింతన్ శిబిర్ అనంతరం…సోనియాగాంధీ కోవిడ్ అనంతరం తెలెత్తిన ఆరోగ్య సమస్యలు పునరావ్రుతం కావడం గమనార్హం. ఇక కేంద్ర ప్రభుత్వం కూడా సోనియాగాంధీ ఆరోగ్యంపై నిరంతరం సమీక్షిస్తోంది.