Site icon HashtagU Telugu

Lok Sabha Polls 6th Phase : ఓటు హక్కును వినియోగించుకున్న సోనియా , రాహుల్

Soniya Rahul Vote

Soniya Rahul Vote

సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. దేశ వ్యాప్తంగా ఆరో విడత పోలింగ్ ఉదయం నుండి ప్రశాంతంగా కొనసాగుతుంది. ఆరో విడతలో భాగంగా ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతుంది. వీటిలో మొత్తంగా 889 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ విడతలోనే హరియాణాలో ఉన్న మొత్తం 10 స్థానాలకు, దిల్లీలో ఉన్న మొత్తం 7 సీట్లకూ, జమ్మూ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్-రాజౌరీ లోక్‌సభ స్థానానికి, ఉత్తర్‌ప్రదేశ్‌లో 14, బిహార్ 8, బంగాల్ 8, ఒడిశా 6, ఝార్ఖండ్ 4 స్థానాలకు పోలింగ్ జరగుతుంది. రాజకీయ పార్టీల నేతలంతా ఉదయమే తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోటీపడ్డారు.

We’re now on WhatsApp. Click to Join.

ఏఐసీసీ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. న్యూఢిల్లీ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఓ పోలింగ్ సెంటర్లో తమ ఓటు వేశారు. పొత్తులో భాగంగా న్యూఢిల్లీ నుంచి బరిలో ఉన్న ఆప్ ఎంపీ అభ్యర్థి సోమనాథ్ భారతికి వీరు మద్దతిచ్చారు. దీంతో తొలిసారి కాంగ్రెసేతర పార్టీకి ఓటేయాల్సి వచ్చింది. వీరిద్దరూ ఇప్పటివరకు కాంగ్రెస్ కు తప్ప ఇతర పార్టీకి ఓటేయలేదు. అలాగే రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము న్యూఢిల్లీ నియోజకవర్గంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఫ్లడ్ దంపతులు, మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ దంపతులు ఢిల్లీలో ఓటేశారు. ఝార్ఖండ్లోని రాంచీలో తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్, భువనేశ్వర్లో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాజీవ్ కుమార్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Read Also : MLC By Poll : కాసేపట్లో ముగియనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారం