Gang-Rape : జార్ఖండ్‌లో దారుణం.. సాఫ్ట్వేర్ ఇంజ‌నీర్‌పై సామూహిక అత్యాచారం

జార్ఖండ్‌లోని చైబాసాలో దారుణం జ‌రిగింది. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను కొట్టి, సామూహిక అత్యాచారం చేశారన్న ఆరోపణలపై 10..

Published By: HashtagU Telugu Desk
Gang Raped

Gang Raped

జార్ఖండ్‌లోని చైబాసాలో దారుణం జ‌రిగింది. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను కొట్టి, సామూహిక అత్యాచారం చేశారన్న ఆరోపణలపై 10 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో బాధితురాలి వాంగ్మూలం తీసుకుని పోలీసులు నమోదు చేశారు. అక్టోబర్ 20న ఆమె తన స్నేహితురాలితో కలిసి బయటకు వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది. మహిళ రోడ్డు పక్కన తన స్నేహితుడితో మాట్లాడుతుండగా.. ఎనిమిది నుండి పది మంది వ్యక్తులు వచ్చి వారిని కొట్టారని పోలీసులు తెలిపారు. వారంతా ఆ మహిళను ఏకాంత ప్రదేశానికి బలవంతంగా తీసుకెళ్లి అత్యాచారం చేసినట్లు పోలీసుల‌కు ఆమె వాగ్మూలంలో తెలిపింది. కేసు దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేశారు. మరోవైపు భద్రతను కట్టుదిట్టం చేసిన పోలీసులు సదర్ ఆసుపత్రిలో మహిళకు చికిత్సను అందిస్తున్నారు. చైబాసా ముఫాసిల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని టెక్రాహటు ప్రాంతంలోని ఓ ఏరోడ్రోమ్ సమీపంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు.

  Last Updated: 22 Oct 2022, 11:47 AM IST