Site icon HashtagU Telugu

Mumbai Airport : డ్రగ్స్‌ను క్యాప్సూల్స్ రూపంలో పొట్టలో దాచి స్మగ్లింగ్..

Smuggling drugs by hiding them in the form of capsules.

Smuggling drugs by hiding them in the form of capsules.

Mumbai Airport : ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. ఒక వ్యక్తి డ్రగ్స్‌ను క్యాప్య్సూల్స్ రూపంలో పొట్టలో ఉంచుకుని అక్రమ రవాణాకు సిద్ధమైనట్లు అధికారులు గుర్తించారు. ముంబాయి ఎయిర్‌పోర్ట్‌లో గ్రీన్ చానెల్ ద్వారా వెళ్లేందుకు ప్రయత్నించిన ఈ కేటుగాడిని, ట్రావెల్ హిస్టరీ ఆధారంగా అనుమానంతో అదుపులోకి తీసుకుని విచారించారు. అధికారులు స్మగ్లర్‌ను ఆసుపత్రికి తరలించి, వైద్యుల సహాయంతో శస్త్రచికిత్స ద్వారా పొట్టలో దాచిన డ్రగ్స్‌ను వెలికితీశారు. కస్టమ్స్ అధికారులు సదరు వ్యక్తిపై NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. స్మగ్లింగ్‌లో ఎక్కువగా విదేశీయులు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది.  ఈ ఘటన ముంబయిలో డ్రగ్స్ మాఫియా మళ్లీ చురుకుగా ఉందని సూచిస్తోంది.

మరోవైపు కస్టమ్స్ బృందం విమానాశ్రయంలో 55 కోట్ల రూపాయల విలువైన వజ్రాలు, బంగారం, ఫారిన్ గంజాయిని పట్టుకుంది. బట్టలకు బదులుగా విదేశీ గంజాయిని ప్యాకింగ్ చేసిన స్మగ్లర్, బంగారాన్ని ముద్దగా చేసి ప్లాస్టిక్ కవర్‌లో ప్యాక్ చేసి, బెల్ట్‌లా తయారు చేసుకొని నడుముకు కట్టుకున్నట్లు అధికారులు గుర్తించారు. జనవరి నెలలోనే కస్టమ్స్ అధికారులు స్మగ్లింగ్‌పై గట్టి నిఘా పెట్టి, ఈ భారీ స్వాధీనం చేసుకున్నారు. సింగపూర్, ఇథియోపియా, బ్యాంకాక్, దుబాయ్, కెన్యా నుండి ఢిల్లీకి వచ్చిన 8 మంది స్మగ్లర్లను కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు. వారు డ్రగ్స్, బంగారాన్ని స్మగ్లింగ్ చేయడానికి వినూత్నమైన మార్గాలను అనుసరించారు.

ఇకపోతే.. ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయం కార్గోలో భారీగా నిషేధిత ఇంజక్షన్స్‌ ను కస్టమ్స్‌ అధికారులు గుర్తించారు. బ్యాంకాక్‌కు ఎగుమతి చేయడానికి సిద్ధంగా ఉన్న 5000 నిషేధిత కేటామైన్‌ ఇంజక్షన్స్‌ గుర్తించి సీజ్‌ చేశారు. 15 కాటన్‌ బాక్సుల్లో ఈ నిషేధిత కేటామైన్‌ ఇంజక్షన్స్‌ ఉండటం గమనార్హం. ఇవి ఎక్కడి నుంచి ఎలా వచ్చాయనే దానిపై దర్యాప్తు చేపట్టారు. ఈ తరహా స్మగ్లింగ్ పెరుగుతున్న నేపథ్యంలో, ఎయిర్‌పోర్ట్‌లో కస్టమ్స్ విభాగం మరింత నిఘా పెంచింది. డ్రగ్స్, బంగారం, వజ్రాల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేశారు. ఈ ఘటనలు ముంబయి ఎయిర్‌పోర్ట్‌ సెక్యూరిటీని మరింత కట్టుదిట్టం చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతున్నాయి.

Read Also: Prabhas : ‘కన్నప్ప’ నుంచి ప్రభాస్ లుక్ రివీల్