Smriti Irani : కాంగ్రెస్ నేతలు క్షమాణలు చెప్పాల్సిందే…లీగల్ నోటీసులు పంపిన స్మృతి ఇరానీ..!!

కేంద్రమంత్రి స్మృతి ఇరానీ కుమార్తె గోవాలో అక్రమంగా బార్ నడుపుతుందని కాంగ్రెస్ నేతలు దూమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలకు స్మృతి ఇరానీ దీటుగా స్పందించారు. ఆమె న్యాయపరమైన చర్యలకు దిగారు.

  • Written By:
  • Publish Date - July 24, 2022 / 06:59 PM IST

కేంద్రమంత్రి స్మృతి ఇరానీ కుమార్తె గోవాలో అక్రమంగా బార్ నడుపుతుందని కాంగ్రెస్ నేతలు దూమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలకు స్మృతి ఇరానీ దీటుగా స్పందించారు. ఆమె న్యాయపరమైన చర్యలకు దిగారు. తప్పుడు ఆరోపణలు చేసిన కాంగ్రెస్ నేతలు క్షమాపణలు చెప్పాలంటూ న్యాయవాది ద్వారా లీగల్ నోటీసులు పంపించారు స్మృతి ఇరానీ. కాంగ్రెస్ నేతలు పవన్ ఖేరా, జైరాం రమేశ్, నెట్టా డిసౌజాలకు నోటీసులు పంపించారు.

ఆరోపణలు వెనక్కు తీసుకోవాలని…బేషరతుగా లిఖితపూర్వకంగా క్షమాపణలు చెప్పాల్సిందేనని స్మృతి ఇరానీ డిమాండ్ చేశారు. ఓ మంత్రిగా, వ్యక్తిగా ప్రజాజీవనంలో ఉన్న తన క్లయింటు పేరుప్రతిష్టలకు భంగం వాటించేవిధంగా ఈ అసత్య ఆరోపణలు చేశారని నోటీసుల్లో పేర్కొన్నారు. కేంద్రమంత్రి స్మృతి ఇరానీ కుమార్తే జోయిష్ ఇరానీకి గోవాలో ఎలాంటి లేదని స్పష్టం చేశారు.

ఇక కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తన్నబార్ దగ్గర గోవా యూత్ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు తలివెళ్లారు. బార్ అనే అక్షరాలపై ప్లాస్టర్ అతికించి ఉండటాన్ని గుర్తించారు. ఆ ప్లాస్టర్ ను తొలగించి దీనికి సంబంధించిన వీడియోను యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు బీవీ శ్రీనివాస్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.