Smarika: తండ్రి కోసం లక్షల జీతం వచ్చే ఉద్యోగం వదిలి నాగలి చేటపట్టిన యువతి..! హ్యాట్సాఫ్..!

ప్రస్తుతం దేశంలో మెజారిటీ యువత ఐటీ రంగం వైపు చూస్తున్నారు. సంవత్సరానికి లక్షలు కుమ్మరించే జాబ్ చేస్తూ మన మూలం అయిన వ్యవసాయాన్ని మరచిపోతున్నారు.

  • Written By:
  • Publish Date - January 2, 2023 / 10:55 PM IST

Smarika: ప్రస్తుతం దేశంలో మెజారిటీ యువత ఐటీ రంగం వైపు చూస్తున్నారు. సంవత్సరానికి లక్షలు కుమ్మరించే జాబ్ చేస్తూ మన మూలం అయిన వ్యవసాయాన్ని మరచిపోతున్నారు. ఇక మహిళలు శారీరిక శ్రమ చేయలేరని ఒక ముద్ర ఉంది. వారు వ్యవసాయానికి మరింత దూరంగా ఉంటూ వచ్చారు. అయితే ఈ రోజుల్లో అమ్మాయిలు మాత్రం దేనికి వెనుకాడడం లేదు.

ఛత్తీస్గఢ్ లోని స్మరిక అనే ఒక యువతి తన స్వార్థం ఆలోచించుకోకుండా ఇతరులకు ఉపాధి కల్పించాలని నెలకు లక్షల రూపాయలను ఇచ్చే కార్పొరేట్ జగన్ వదిలేసి వచ్చింది. స్మరికా బిఎ చేసి ఆ తర్వాత ఎంబీఏ కూడా చేసింది. ఒక మల్టీ నేషనల్ కంపెనీలో సంవత్సరానికి 10 లక్షల జీతం తీసుకుంటుంది. అయితే అతని తండ్రికి కాలేయ మార్పిడి ఆపరేషన్ జరగడం వల్ల అతను ఎన్నో సంవత్సరాలుగా చేసిన వ్యవసాయానికి స్వస్తి చెప్పాల్సి వచ్చింది.

అయితే స్మరిక తండ్రి తన 23 ఎకరాల్లో చేసే వ్యవసాయం వల్ల 100 మందికి ఉపాధి కలుగుతుంది. ఇక వారంతా దిక్కుతోచని స్థితిలో పడ్డప్పుడు వారికోసం స్మరిక తన ఉద్యోగాన్ని వదిలేసి వచ్చి తండ్రి వ్యవసాయాన్ని చేపట్టింది. మొదట్లో ఇబ్బంది పడ్డ చిన్నప్పటినుండి తండ్రి వ్యవసాయం చేయడం చూస్తూ వచ్చిన స్మరిక తర్వాత పుంజుకొని వారందరికీ అండగా నిలిచింది. మిర్చి, జామ, వెదురు, బొప్పాయి, కొబ్బరి, స్ట్రాబెర్రీ, కూరగాయల పంటలపై దృష్టి సారించింది. నాణ్యత కారణంగా ఢిల్లీ, యూపీ, ఆంధ్రా, కోల్‌కతా, బీహార్, ఒడిశా వరకు ఆమె తన ఉత్పత్తులను మార్కెట్ చేస్తోంది. ఈ సంవత్సరం నుండి వారి ఉత్పత్తులను విదేశాలకు కూడా పంపించాలని ఆలోచనలో ఉంది.