New Income Tax Bill : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొత్త ఆదాయ పన్ను 2025 బిల్లును ఈరోజు లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లును చాలా సరళమైన రీతిలో రూపొందించినట్లు సభలో తెలిపారు. ఈ సందర్భంగా ఈ కొత్త ఆదాయపు పన్ను బిల్లును హౌజ్ కమిటీకి సిఫారసు చేయాలని ఆమె స్పీకర్ ఓం బిర్లాను కోరారు. అయితే ఈ బిల్లును ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి. కానీ మోజువాణి ఓటు ద్వారా బిల్లు తీర్మానాన్ని ఆమోదించారు. వచ్చే సెషన్ తొలి రోజున ఆ సెలెక్ట్ కమిటీ కొత్త బిల్లుపై తమ నివేదికను ఇవ్వనున్నది. నిర్మలా సీతారామన్ ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టిన అనంతరం విపక్షాలు సభ నుంచి వాకౌట్ చేశాయి. దీంతో కాసేపటికే లోక్‌సభ మార్చి 10కి వాయిదా పడింది.
Read Also: Mini Medaram Jatara : వన దేవతలను దర్శించుకున్న మంత్రి సీతక్క
1961లో రూపొందించిన ఆదాయపు పన్ను చట్టానికి, 66 బడ్జెట్‌లలో (రెండు మధ్యంతర బడ్జెట్లు కలిపి) ఎన్నో సవరణలు జరిగాయి. దీంతో సంక్లిష్టంగా తయారైంది. పన్ను చెల్లింపుదార్లకు వ్యయాలూ పెరిగాయి. దీంతో ఈ చట్టాన్ని సమీక్షించి, సరళతరం చేస్తామని 2024 జులై బడ్జెట్‌లో ప్రభుత్వం పేర్కొంది. ఆ మేరకు ఇప్పుడు బిల్లును రూపొందించారు. మొత్తం మీద కొత్త చట్టం సమీక్ష నిమిత్తం 6500 సలహాలను ఆదాయ పన్ను విభాగం అందుకుంది. వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకుని, కొత్త బిల్లు తీసుకొచ్చారు. ఈ చట్టాన్ని సమీక్షించడానికి కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి (CBDT) ఒక అంతర్గత కమిటీని ఏర్పాటు చేసింది. చట్ట సమీక్షకు 22 ప్రత్యేక సబ్ కమిటీలనూ ఏర్పాటు చేశారు.
ఈ గందరగోళం మధ్యే నివేదికకు రాజ్యసభ ఆమోదం లభించింది. తర్వాత జేపీసీ ఛైర్మన్ దానికి లోక్‌సభ ముందుకు తీసుకువచ్చారు. దిగువసభలోనూ అవే నిరసనలు వ్యక్తమయ్యాయి. దీనిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. అసమ్మతి నోట్‌లను చేర్చడంపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని వెల్లడించారు. విపక్ష సభ్యలు నిరసనలు కొనసాగడంతో లోక్‌సభ వాయిదా పడింది. వక్ఫ్ బిల్లుపై జేపీసీ నివేదికను ఈ రోజు కేంద్రం రాజ్యసభలో ప్రవేశపెట్టింది. ఆ నివేదికను విపక్షాలు తీవ్రంగా విమర్శించాయి. తమ అసమ్మతి నోట్‌లలోని కొన్ని భాగాలను తొలగించారని ఈ సందర్భంగా విపక్షాలు ఆరోపించాయి. ఎగువ సభ నుంచి వాకౌట్ చేశాయి.
Read Also: Delhi CM : ఢిల్లీ సీఎం రేసులో స్మృతీ ఇరానీ, బన్సూరీ స్వరాజ్.. ఎవరికో ఛాన్స్ ?