Yusuf Vs BJP : టీమిండియా మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్ ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో రాజకీయ నేతగా, ప్రజాప్రతినిధిగా ఉన్నారు. ఆయన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ) తరఫున బహరంపూర్ లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా గెలిచారు. బహరంపూర్ అనేది ముర్షిదాబాద్ జిల్లా పరిధిలోకి వస్తుంది. భారత పార్లమెంటు ఆమోదించిన వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఈ జిల్లాలోని సుతి, ధులియా, సంసేర్‌గంజ్ సహా పలు ప్రాంతాలలో హింసాత్మక ఘటనలు జరిగాయి. అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. ఈతరుణంలో శనివారం రోజు ఎంపీ యూసుఫ్ పఠాన్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తన స్టైలిష్ ఫొటో ఒకటి షేర్ చేశారు. ఆ ఫొటోలో.. యూసుఫ్ కాఫీ తాగుతూ దర్జాగా, ఉల్లాసంగా కనిపించారు. ఈ ఫొటోను చూసి బీజేపీ నేతలు ఆగ్రహంతో ఊగిపోయారు.
Also Read :Weekly Horoscope : వారఫలాలు.. ఏప్రిల్ 13 నుంచి 19 వరకు రాశి ఫలాలను తెలుసుకోండి
సిగ్గుగా అనిపించడం లేదా? : షెహజాద్ పూనావాలా
‘‘ఓ వైపు వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ముర్షిదాబాద్(Yusuf Vs BJP), మాల్దా, దక్షిణ 24 పరగణాలు, హుగ్లీ జిల్లాల్లో నిరసనలు జరుగుతుంటే.. మరోవైపు కూల్‌గా యూసుఫ్ పఠాన్ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడం సరికాదు’’ అంటూ బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా ట్వీట్ చేశారు. ‘‘పఠాన్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో ప్రజలు అల్లాడిపోతుంటే వారిని ఆదుకోకుండా, కనీసం పరామర్శించకుండా ఇలాంటి పోస్టులు పెట్టడానికి సిగ్గుగా అనిపించడం లేదా?’’ అని ఆయన ప్రశ్నించారు. ‘‘బెంగాల్ మండిపోతోంది. పోలీసులు మౌనంగా ఉన్నారు. మమతా బెనర్జీ హింసను ప్రోత్సహిస్తున్నారు. యూసుఫ్ పఠాన్ ఒక ఎంపీగా ఉండి కూడా ఎంజాయ్ చేస్తున్నారు. తన నియోజకవర్గంలో హిందువులు ఊచకోతకు గురవుతున్న క్షణాన్ని ఆస్వాదిస్తున్నారు. ఇది తృణముల్ కాంగ్రెస్ అంటే’’ అని పూనావాలా ఫైర్ అయ్యారు.
Also Read :New Political Party: మరో కొత్త రాజకీయ పార్టీ.. జయలలిత సన్నిహితుడి స్కెచ్
రెండు రోజుల్లో 118 మంది అరెస్ట్
వక్ఫ్ సవరణ చట్టంపై పశ్చిమ బెంగాల్‌లో రెండు రోజుల పాటు జరిగిన నిరసనల్లో ఇప్పటివరకు ముగ్గురు చనిపోగా, పదుల సంఖ్యలో జనం గాయపడ్డారు. రెండు రోజుల వ్యవధిలో నిరసనల్లో పాల్గొన్న 118 మందిని అరెస్టు చేశారు. ఈ హింసాత్మక ఘటనలపై బెంగాల్ శాసనసభ విపక్షనేత సువేందు అధికారి కోల్‌కతా హైకోర్టులో పిటిషన్ వేశారు. ముర్షిదాబాద్ జిల్లాలో కేంద్ర బలగాలను మోహరించాలని హైకోర్టు బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. వివరాలను తమకు నివేదించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.