Site icon HashtagU Telugu

Lata Mangeshkar : గానకోకిల మూగబోయింది!

Lata

Lata

భారత రత్న, ప్రముఖ గాయకురాలు లతా మంగేష్కర్‌ కన్నుమూశారు. ఆమె వయస్సు 92 సంవత్సరాలు.. కొంత కాలంగా  బీచ్‌ క్రాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె కన్నుమూశారు. లతా మంగేష్కర్‌ గత నెలలో కరోనా బారిన పడ్డారు. కరోనా లక్షణాలతో  ముంబయి బీచ్‌ క్రాండీ ఆస్పత్రిలో చేరారు. అప్పటి నుంచి ఆమె ఆస్పత్రిలోనే ఉన్నారు. కొన్ని రోజుల క్రితం ఆమె ఆరోగ్యం మెరుగుపడినట్టు వైద్యులు తెలిపారు. కానీ.. మళ్లీ కొన్నిరోజులుగా ఆమె ఆరోగ్యం క్షీణించడం మొదలైంది.

వయోభారం కారణంగా ఆమెను కాపాడటం వైద్యులకు కష్టమైంది. మెరుగవుతున్న దశలో మళ్లీ లతా మంగేష్కర్ ఆరోగ్యం విషమించి కన్నుమూశారు. చిన్న వయస్సులోనే  గాయనిగా కేరీర్ ప్రారంభించిన లతామంగేష్కర్‌.. వివిధ భారతీయ భాషల్లో 30వేలకుపైగా పాటలు పాడారు. కోట్ల అభిమానులను సంపాదించుకున్నారు. భారత నైటింగేల్‌గా గుర్తింపు పొందిన లతా మంగేష్కర్..   భారతరత్న సహా అనేక పురస్కారాలు పొందారు. అంతకుముందే పద్మవిభూషణ్, పద్మభూషణ్ అందుకున్నారు. సినీ రంగంలో దాదాసాహెబ్ పాల్కేసహా అనేక సినీ పురస్కారాలు అందుకున్నారు లతా మంగేష్కర్‌.

లతా మంగేష్కర్ మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జన్మించారు. 13 ఏళ్ల వయసులో తండ్రి మరణంతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు.1942లో ప్లేబ్యాక్ సింగర్‌గా తొలి పాట పాడారు. లతా మంగేష్కర్ వివిధ భారతీయ భాషల్లో 50,000 పాటలు పాడారు. లతకు భారతరత్న సహా ఎన్నో అవార్డులు వచ్చాయి.

 

లతా మంగేష్కర్ గురించి..