Day 16 – 41 Workers : మరో నాలుగైదు రోజులు సొరంగంలోనే 41 మంది కార్మికులు

Day 16 - 41 Workers : ఉత్తరాఖండ్‌లోని ఉత్తర కాశీ ప్రాంతంలో కూలిపోయిన సిల్క్యారా సొరంగంలో 41 మంది కార్మికులు చిక్కుకొని నేటికి(సోమవారం) 16 రోజులు గడిచాయి.

Published By: HashtagU Telugu Desk
Day 16 41 Workers

Day 16 41 Workers

Day 16 – 41 Workers : ఉత్తరాఖండ్‌లోని ఉత్తర కాశీ ప్రాంతంలో కూలిపోయిన సిల్క్యారా సొరంగంలో 41 మంది కార్మికులు చిక్కుకొని నేటికి(సోమవారం) 16 రోజులు గడిచాయి. వారు చిక్కుకున్న సొరంగం భాగాన్ని  అడ్డంగా డ్రిల్లింగ్ చేసే ప్రక్రియ కొనసాగుతోంది. ప్రస్తుతం ఆర్మీ సిబ్బంది, డ్రిల్లింగ్ నిపుణులు కలిసి మ్యానువల్‌గా ఈ డ్రిల్లింగ్ వర్క్ చేస్తున్నారు. కార్మికులకు అడ్డుగా దాదాపు 60 మీటర్ల మేర కాంక్రీట్ శిథిలాలు పడిపోయాయి. వాటిని అడ్డంగా దాదాపు 50 మీటర్ల మేర డ్రిల్లింగ్ చేశారు.  మిగతా 10 మీటర్ల శిథిలాల డ్రిల్లింగ్ పూర్తి కావడానికి దాదాపు ఐదు రోజుల టైం పడుతుందని అంటున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

  • కార్మికులను కాపాడే ప్లాన్ బీ‌లో భాగంగా.. నిలువులోనూ సొరంగాన్ని  డ్రిల్లింగ్ చేసే పనులు ఆదివారమే ప్రారంభమయ్యాయి. నిలువులో దాదాపు 86 మీటర్లు డ్రిల్ చేయాల్సి ఉంటుంది. తొలిరోజైన ఆదివారం 19.2 మీటర్లు డ్రిల్ చేశారు. ఈ లెక్కన నిలువులో సొరంగం డ్రిల్లింగ్ పనులు పూర్తి కావాలంటే ఇంకో నాలుగు రోజుల టైం పడుతుంది.
  • ఇక సోమవారం నుంచి సొరంగాన్ని లంబ ఆకారంలో డ్రిల్లింగ్ చేసే పనులు కూడా మొదలుకానున్నాయి. లంబ ఆకారంలో దాదాపు 170 మీటర్లు డ్రిల్ చేయాల్సి ఉంటుంది. ఈ వర్క్ కూడా పూర్తి కావడానికి దాదాపు వారం రోజుల టైం పడుతుంది.
  • ఏ రకంగా చూసుకున్నా .. సిల్క్యారా టన్నెల్‌లో చిక్కుకున్న 14 మంది కార్మికులు మరో నాలుగైదు రోజులకుపైనే సొరంగంలో ఉండాల్సి వస్తుందనే విషయం(Day 16 – 41 Workers) స్పష్టమవుతోంది.

Also Read: World Largest Iceberg: కదులుతున్న ప్రపంచంలోనే అతిపెద్ద మంచుకొండ

  Last Updated: 27 Nov 2023, 10:38 AM IST