Elections Results 2024 : సిక్కింలో ఎస్‌కేఎం.. అరుణాచల్‌లో బీజేపీ.. స్పష్టమైన ఆధిక్యం

హిమాలయ రాష్ట్రాలైన సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్‌ల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆదివారం ఉదయం 6 గంటలకు ప్రారంభమైంది.

  • Written By:
  • Updated On - June 2, 2024 / 07:56 AM IST

Elections Results 2024 : హిమాలయ రాష్ట్రాలైన సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్‌ల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆదివారం ఉదయం 6 గంటలకు ప్రారంభమైంది. ఇవాళ ఈ రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ రెండు రాష్ట్రాల అసెంబ్లీల గడువు జూన్ 2వ తేదీనే ముగిసింది. దీంతో ఇవాళే ఆ రెండు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు నిర్వహిస్తున్నారు. ఈ రాష్ట్రాల లోక్‌సభ ఎన్నికల ఫలితాలు(Elections Results 2024) మాత్రం జూన్ 4వ తేదీనే విడుదల అవుతాయి.

We’re now on WhatsApp. Click to Join

ఎన్నికల ఫలితాల టాప్ అప్ డేట్స్

  • ఈసారి అరుణాచల్ ప్రదేశ్‌లో  10 మంది బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో ఇవాళ మిగతా 50 అసెంబ్లీ స్థానాల ఫలితాలు రానున్నాయి. 2019లో ఈ రాష్ట్రంలో బీజేపీ మొత్తం  60  స్థానాల్లో పోటీ చేయగా 41 సీట్లు గెలిచింది. ఇక క లుచుకున్న బీజేపీ మొత్తం 60 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టింది.
  • అరుణాచల్ ప్రదేశ్‌ మొత్తం 60 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇవాళ ఉదయం కౌంటింగ్ ప్రారంభమైన గంట తర్వాత అరుణాచల్‌లో బీజేపీ 30 స్థానాల్లో, దాని మిత్రపక్షం కాన్రాడ్ సంగ్మా నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్‌పీపీ) మూడు స్థానాల్లో ఆధిక్యంలో ముందుకు సాగుతున్నాయి.
  • సిక్కింలో మొత్తం 32 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వీటిలో  అధికార సిక్కిం క్రాంతికారి మోర్చా (ఎస్‌కేఎం) పార్టీ  22 చోట్ల, ప్రతిపక్ష సిక్కిం డెమొక్రటిక్ ఫ్రంట్ (ఎస్‌డీఎఫ్) రెండుచోట్ల ఆధిక్యంలో ముందుకు సాగుతున్నాయి. రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులు ఇంకా ఎక్కడ కూడా ఆధిక్యంలోకి రాలేదు.
  • అరుణాచల్ ప్రదేశ్‌లో ఇప్పటికే  ఏకగ్రీవంగా ఎన్నికైన అభ్యర్థుల జాబితాలో ముఖ్యమంత్రి పెమా ఖండూ ఉన్నారు. ఆయన తవాంగ్ జిల్లాలోని ముక్తో స్థానం నుంచి పోటీ లేకుండానే ఎమ్మెల్యేగా మూడోసారి గెలిచారు. ఇప్పటివరకు ఆయన మొత్తం నాలుగుసార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు.

Also Read : Hair Trim : తరచుగా జుట్టు కత్తిరించడం వల్ల నిజంగా జుట్టు పొడవుగా పెరుగుతుందా..?

  • అరుణాచల్ ప్రదేశ్‌లో ఏకగ్రీవంగా ఎన్నికైన వారిలో చౌకమ్ స్థానం నుంచి ఉప ముఖ్యమంత్రి చౌనా మెయిన్, ఇటానగర్ నుంచి టెకీ కాసో, తాలిహా నుంచి న్యాతో దుకం, రోయింగ్ నుంచి ముచ్చు మితి ఉన్నారు.
  • 2019 అసెంబ్లీ ఎన్నికల్లో అరుణాచల్ ప్రదేశ్‌లో జేడీ(యూ) ఏడు సీట్లు, నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్‌పీపీ) ఐదు, కాంగ్రెస్ నాలుగు, పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ (పీపీఏ) ఒక సీటు గెలుచుకున్నాయి. ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు గెలిచారు.
  • సిక్కింలో అధికార సిక్కిం క్రాంతికారి మోర్చా,  సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ (SDF) మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. సిక్కింలో మొత్తం 32 అసెంబ్లీ స్థానాలు ఉన్నారు. వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చే దిశగా సిక్కిం క్రాంతికారి మోర్చా పార్టీ  దూసుకుపోతోంది.  సిక్కింలో కాంగ్రెస్ 12 స్థానాల్లో పోటీ చేస్తోంది. బీజేపీ 31 మంది అభ్యర్థులను నిలబెట్టింది.  సిక్కిం క్రాంతికారి మోర్చా మొత్తం 32 స్థానాల్లో పోటీ చేస్తోంది.
  • సిక్కింలో ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ ఈసారి రెనాక్, సోరెంగ్-చకుంగ్ అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నారు.
  • 2019 ఎన్నికలకు ముందు సిక్కిం రాష్ట్రాన్ని సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ (SDF) వరుసగా 25 ఏళ్లు పాలించింది.

Also Read :Ring Worm : రింగ్‌వార్మ్‌కు కొబ్బరి నూనె నివారణ