Putin: రష్యా అధ్యక్షుడికి క్యాన్సరా..?

రష్యా అధ్యక్షుడు క్యాన్సర్ తో బాధపడుతున్నారా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.

  • Written By:
  • Updated On - April 2, 2022 / 05:52 PM IST

రష్యా అధ్యక్షుడు క్యాన్సర్ తో బాధపడుతున్నారా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. మీడియా ప్రాజెక్టు అనే సంస్థ పుతిన్ అరోగ్యంపై పరిశోధనాత్మక కథనాన్ని అందించింది. ఆ రిపోర్టు ప్రకారం…పుతిన్ తన ఆనారోగ్యాన్ని జనాలకు తెలియకుండా దాచి పెడుతున్నట్లు తెలిపింది. తన అనారోగ్యంపై ప్రజల దృష్టిని మళ్లించేందుకు పుతిన్ ఉక్రెయిన్ పై యుద్ధానికి దిగారంటూ ఆరోపణలు చేసింది. అయితే ఈ విషయంలో మీడియా ఆరోపణలు ఏమాత్రం నమ్మేట్లుగా అనిపించడం లేదు.

ఎందుకంటే తన అనారోగ్యాన్ని దాచిపెట్టాలంటే ఇతర కారణాలు ఏన్నో ఉంటాయి. కానీ పొరుగు దేశంపై యుద్ధానికి దిగుతారా..? సరే…ఈ విషయాన్ని పక్కన పెడితే క్యాన్సర్ కు మందులు వాడుతున్న కారణంగా పుతిన్ మెడ మొహం వాచిపోయిందని కూడా చెబుతోంది. పుతిన్ అరోగ్యం మానిటర్ చేయడానికి 24 గంటలూ వైద్యుల బృందం సిద్ధంగా ఉంటుందని కూడా చెప్పుకొచ్చింది. ఒక దేశ అధ్యక్షుడు అందులోనూ అగ్రరాజ్యం రష్యా అధ్యక్షుడి ఆరోగ్యం మానిటర్ చేయడానికి వైద్యులు సిద్ధంగా ఉండటంలో ఏమైన వింత కనిపిస్తుందా..?

ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే…వైద్యుల బృందంలో థైరాయిడ్ క్యాన్సర్ స్పెషలిస్టుతోపాటు మరో న్యూరో సర్జన్ కూడా ఉన్నట్లు చెప్పడం ఒక్కంతు ఆశ్చర్యానికి గురిచేసింది. థైరాయిడ్ సమస్య ముదిరిపోయిన కారణంగానే పుతిన్ కు థైరాయిడ్ క్యాన్సర్ వచ్చినట్లు చెప్పింది. 2020లో పుతిన్ నేషనల్ మెడికల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ ఎండోక్రైనాలజీ అధిపతి ఇవాన్ను కలిసినట్లు కూడా చెప్పింది. ఇదే కాదు పుతిన్ రెగ్యులర్ గా ఒక రిసార్టులో ఉండి చికిత్స తీసుకుంటున్నారట. మీడియా చెప్పిన రిసార్టుకు పుతిన్ రెగ్యులర్ గా వెళ్తారన్నది నిజమే. కొద్దిరోజులుగా ఎవ్వరికీ కనిపించకుండా పుతిన్ మాయమైతున్నది కూడా వాస్తవమే. అయితే దీనంతటికీ కారణం క్యాన్సర్ కు చికిత్స తీసుకోవడమే అని మీడియా చెప్పే మాట. ఈ విషయాన్ని ఆ దేశా అధికారులు కొట్టిపారేస్తున్నారు. పుతిన్ ఆరోగ్యంపై పుకార్లు పుట్టించడం పాశ్చాత్య దేశాల మీడియాకు అలవాటైందంటున్నారు. అసలు నిజమేంటో…ఆ పరమేశ్వరుడికే తెలియాలి.