Shushrutha Gowda : రాహుల్‌గాంధీతో దేశవ్యాప్తంగా పర్యటించిన నేత.. బీజేపీలోకి జంప్ !

Shushrutha Gowda : ఆయన కాంగ్రెస్ కీలక నేత. పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో కలిసి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు దేశవ్యాప్తంగా భారత్ జోడో యాత్రలో ఆయన పాల్గొన్నారు.

  • Written By:
  • Updated On - April 25, 2024 / 02:06 PM IST

Shushrutha Gowda : ఆయన కాంగ్రెస్ కీలక నేత. పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో కలిసి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు దేశవ్యాప్తంగా భారత్ జోడో యాత్రలో ఆయన పాల్గొన్నారు. కట్ చేస్తే.. ఇప్పుడు ఆ నాయకుడు బీజేపీలో చేరిపోయారు.  మనం చెప్పుకుంటున్నది కర్ణాటక కాంగ్రెస్ నేత  శుశ్రుత గౌడ గురించి !!

We’re now on WhatsApp. Click to Join

రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్రకు సంబంధించిన ప్రణాళికలను కూడా శుశ్రుత గౌడ అప్పట్లో దగ్గరుండి చూసుకున్నారు. అంత చనువుగా నడుచుకున్న వ్యక్తి కూడా మోడీ సేనలోకి చేరిపోవడం గమనార్హం. ‘‘ప్రజలకు సేవ చేయడమే నా లక్ష్యం. నా కలను సాకారం చేసుకోవడానికి బీజేపీ ఉత్తమమైన పార్టీ అని నేను భావించాను. అందుకే ఆ పార్టీలో చేరాను’’ అని శుశ్రుత గౌడ(Shushrutha Gowda) చెప్పారు. దేశ అభివృద్ధిలో తన వంతు పాలుపంచుకోవడం కోసమే బీజేపీలో చేరుతున్నట్లు వెల్లడించారు.

Also Read :CM Revanth Reddy: బీజేపీకి ఓట్లు వేస్తే రిజర్వేషన్లు రద్దు అయినట్టే : సీఎం రేవంత్

త్వరలోనే అయోధ్య రామయ్య సన్నిధికి రాహుల్, ప్రియాంక?

త్వరలోనే రాహుల్‌ గాంధీ, ప్రియాంకా గాంధీ కలిసి అయోధ్య సందర్శనకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్‌ 26న అమేథీ, రాయ్‌బరేలీ స్థానాల్లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. అమేథీ నుంచి రాహుల్‌ గాంధీ, రాయ్‌బరేలీ నుంచి ప్రియాంకా గాంధీ పోటీ చేసే అవకాశం ఉందట. ఏప్రిల్‌ 30 తర్వాత దీనిపై అధికారిక ప్రకటన వెలువడే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఈ రెండు స్థానాలకు నామినేషన్‌ వేసేందుకు మే 3 ఆఖరు తేదీ. దానికి రెండు రోజుల ముందే రాహుల్‌, ప్రియాంక వేర్వేరు రోజుల్లో నామినేషన్‌ వేసే అవకాశాలున్నాయి. ఈ క్రమంలోనే ఆయా స్థానాల్లో వీరు ప్రచారం మొదలుపెట్టడానికి ముందు అయోధ్యలో బాలరాముడిని దర్శించుకుంటారని  విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. 2004 నుంచి వరుసగా మూడు సార్లు అమేథీకి రాహుల్‌ గాంధీ ప్రాతినిధ్యం వహించారు. 2019లో బీజేపీ నాయకురాలు స్మృతి ఇరానీ చేతిలో ఆయన ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో మరోసారి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ  బరిలో ఉన్నారు. ప్రియాంకాగాంధీ భర్త రాబర్ట్‌ వాద్రా కూడా ఇక్కడి నుంచి బరిలోకి దిగేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.

Also Read : PM Modi Vs Rahul Gandhi : ప్రధాని మోడీ, రాహుల్‌గాంధీ ప్రసంగాలపై ఈసీ నోటీసులు