Site icon HashtagU Telugu

India Alliance : కేంద్రం వైఖరిపై జోక్యం చేసుకోవాలి..ECI కి ఇండియా కూటమి ఫిర్యాదు

Should intervene on Centre's stand..India alliance complains to ECI

Should intervene on Centre's stand..India alliance complains to ECI

 

India Alliance : ప్రతిపక్ష పార్టీల పట్ల అధికార బీజేపీ(bjp) వ్యవహరిస్తున్న వైఖరిపై ఇండియా (INDIA) కూటమి భారత ఎన్నికల సంఘానికి (ECI) ఫిర్యాదు చేసింది. కాంగ్రెస్‌ పార్టీ(Congress Party) జాతీయ కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌(KC Venugopal), ఆ పార్టీ సీనియర్‌ నేత, ప్రముఖ న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వీ(Abhishek Manu Singhvi), కూటమిలోని అన్ని పార్టీల ప్రతినిధులు కలిసి శుక్రవారం భారత ఎన్నికల సంఘాన్ని కలిశారు. ఢిల్లీ సీఎం అర్వింద్‌ కేజ్రీవాల్‌ అరెస్ట్‌ నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.

కేంద్ర సర్కారు ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఈడీ, సీబీఐ లాంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను అడ్డం పెట్టుకుని ప్రతిపక్ష పార్టీలను వేధిస్తోందని ఈ సందర్భంగా ఇండియా కూటమి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. సమావేశం అనంతరం అభిషేక్‌ మనుసింఘ్వి మీడియాతో మాట్లాడారు. ఢిల్లీ ముఖ్యమంత్రిని గురువారం అర్థరాత్రి అరెస్ట్‌ చేశారు. అధికార పార్టీ తీరుపై ఎన్నికల సంఘంతో సమగ్రంగా చర్చించాం. ఇది ఒక వ్యక్తికి, పార్టీకి సంబంధించిన అంశం కాదు, రాజ్యాంగ మౌలిక సూత్రాలకు సంబంధించిన అంశమని అన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

75 ఏళ్ల స్వతంత్ర భారత దేశ చరిత్రలో సిట్టింగ్ ముఖ్యమంత్రిని అరెస్ట్‌ చేయడం ఇదే తొలిసారని సింఘ్వి చెప్పారు. కేంద్రం వైఖరిపై జోక్యం చేసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరామన్నారు. ప్రతిపక్షాలపై కక్ష సాధింపు కోసం బీజేపీ కేంద్ర దర్యాప్తు సంస్థలను ఏవిధంగా దుర్వినియోగం చేస్తున్నదో ఈసీకి ఆధారాలతో సహా వివరించామని చెప్పారు. ఎన్నికల సందర్భంగా డీజీపీని, సెక్రెటరీని మార్చే మీరు కేంద్ర దర్యాప్తు సంస్థలను ఎందుకు కంట్రోల్‌ చేయలేరని ఎన్నికల సంఘాన్ని అడిగామని అన్నారు.

read also:KCR: కేజ్రీవాల్ అరెస్టు దేశ ప్ర‌జాస్వామ్య చ‌రిత్ర‌లో చీక‌టి రోజు: కేసీఆర్