Site icon HashtagU Telugu

Rajnath Singh Questions Omar Abdullah : అఫ్జల్ గురును పూలమాలతో సన్మానించి ఉండాల్సిందా ? : రాజ్‌నాథ్‌సింగ్

Rajnath Singh Questions Omar Abdullah Afzal Guru Garland

Rajnath Singh Questions Omar Abdullah : 2001 సంవత్సరంలో పార్లమెంటుపై ఉగ్రదాడికి పాల్పడిన టెర్రరిస్ట్ అఫ్జల్ గురును ఉరితీయడం సరికాదంటూ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అగ్రనేత ఒమర్ అబ్దుల్లా  చేసిన వ్యాఖ్యలపై రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్  మండిపడ్డారు. పార్లమెంటుపై దాడి చేసినందుకు అఫ్జల్ గురుకు పూలమాల వేసి సన్మానిస్తే బాగుండేదా అని ఒమర్ అబ్దుల్లాను ఆయన ప్రశ్నించారు. ఉగ్రవాదుల పట్ల నేషనల్ కాన్ఫరెన్సు పార్టీ సానుభూతిని చూపిస్తోందని రాజ్‌నాథ్ నిప్పులు చెరిగారు. కశ్మీర్‌లోని రాంబన్ జిల్లాలో ఆదివారం జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో రక్షణమంత్రి(Rajnath Singh Questions Omar Abdullah) ప్రసంగించారు. జమ్మూ కశ్మీర్‌లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే) ప్రజలు భారతదేశంలో భాగం కావాలని కోరుకునేంతగా డెవలప్‌మెంట్ వర్క్స్ చేస్తామని ఆయన ప్రకటించారు.

Also Read :HYDRA Clarification : ప్రజలు నివసిస్తున్న ఇళ్లను కూల్చే ప్రసక్తే లేదు : హైడ్రా కమిషనర్

‘‘పీఓకే ప్రజలను పాకిస్తాన్ విదేశీయులుగా పరిగణిస్తుంటే..  భారత్ మాత్రం వారిని సొంత మనుషుల్లా భావిస్తోంది. పీఓకే విదేశీ భూమి అని స్వయంగా పాకిస్తాన్ అదనపు సొలిసిటర్ జనరల్ చెప్పారు’’ అని రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. ‘‘ఆర్టికల్ 370ని పునరుద్ధరించే అంశం గురించి నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ మాట్లాడుతోంది. కానీ అది సాధ్యమయ్యే విషయం కాదు’’ అని ఆయన స్పష్టం చేశారు. ఉగ్రవాదానికి మద్దతు పలుకుతున్న ఒమర్ అబ్దుల్లా లాంటి వాళ్లను ఈ ఎన్నికల్లో కశ్మీర్ ప్రజలు తిరస్కరిస్తారని రాజ్‌నాథ్ వ్యాఖ్యానించారు.

Also Read :Russia Ukraine War: అజిత్ దోవల్ రష్యా పర్యటన వెనుక మోడీ మంత్రమేంటి ?

జమ్మూకశ్మీర్‌లో కాంగ్రెస్‌- నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పార్టీల పొత్తుపై రక్షణమంత్రి రాజ్‌నాథ్ విమర్శలు గుప్పించారు.  ఆ పార్టీల పొత్తును, రహస్య ఎజెండాను దేశ ప్రజలు అర్థం చేసుకున్నారని చెప్పారు. ఉగ్రవాదానికి మద్దతు పలుకుతున్న నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడం దారుణమైన విషయమన్నారు. నేషనల్ కాన్ఫరెన్స్ లాంటి పార్టీల వల్ల దేశంలో శాంతియుత వాతావరణం దెబ్బతింటుందని రాజ్‌నాథ్ ఆందోళన వ్యక్తం చేశారు.