కర్ణాటక ప్రభుత్వం (Government of Karnataka) ప్రవేశపెట్టిన గృహలక్ష్మి స్కీమ్ (Gruhalakshmi Scheme) ప్రస్తుతం తీవ్ర నిధుల కొరతతో ఎదుర్కొంటోంది. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది లబ్ధిదారుల అకౌంట్లలో మూడు నెలలుగా డబ్బులు జమ చేయడం లేదు. మహిళలకు ఆర్థిక స్వావలంబన అందించేందుకు ఉద్దేశించిన ఈ పథకాన్ని అమలు చేయడంలో ప్రభుత్వం సమస్యలను ఎదుర్కొంటోంది. దీనితో పాటు అన్నభాగ్య సహా మరికొన్ని గ్యారంటీ స్కీములకు కూడా నిధుల కొరత ఎదురవుతోంది.
Kiran Royal Audio Leak: పవన్ కళ్యాణ్ కు తలనొప్పిగా మారిన కిరణ్ రాయల్
డిప్యూటీ సీఎం శివకుమార్ (Deputy CM Shivakumar) ఈ విషయంపై స్పందిస్తూ.. ప్రస్తుతం ప్రభుత్వ ఖజానాలో తగినన్ని నిధుల్లేవని, త్వరలోనే లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నట్లు స్పష్టం చేశారు. అయితే మూడు నెలలుగా గృహలక్ష్మి పథకం కింద లబ్ధిదారులకు నగదు అందడం లేదన్న విషయం తనకు తెలియదని సిద్దరామయ్య అన్నారు. కానీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తామని, స్కీములను ఆపే ఉద్దేశం లేదని ఆయన స్పష్టం చేశారు.
ఈ పరిస్థితి కారణంగా లబ్ధిదారులలో అసంతృప్తి పెరిగింది. గృహలక్ష్మి పథకాన్ని ఆధారంగా చేసుకుని జీవనోపాధి సాగిస్తున్న మహిళలు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే రోజుల్లో ప్రభుత్వం ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తుందో, నిధుల కొరతను అధిగమించి పథకాన్ని కొనసాగించగలిగేలా చర్యలు తీసుకుంటుందో చూడాలి.