Shoot On Sight : తోడేళ్లు కనిపిస్తే కాల్చేయండి.. యూపీ సీఎం యోగి సంచలన ఆదేశాలు

జులై 17 నుంచి ఇప్పటివరకు బహ్రయిచ్ జిల్లాలో ఆరు తోడేళ్లు జరిపిన దాడుల్లో దాదాపు 10 మంది ప్రాణాలు కోల్పోయారు.

Published By: HashtagU Telugu Desk
Shoot On Sight Wolves Up Govt

Shoot On Sight : ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంచలన ఆదేశాలు జారీ చేశారు. యూపీలోని బహ్రయిచ్ జిల్లా మెహ్సీ తహసీల్ పరిధిలోని అడవులకు సమీపంలో ఉండే గ్రామాల్లో తోడేళ్లు దాడులకు తెగబడుతూ మనుషుల ప్రాణాలు తీస్తున్న ఘటనలపై ఆయన సీరియస్ అయ్యారు. తోడేళ్లు కనిపిస్తే కాల్చేయాలని పోలీసులు, అటవీశాఖ అధికారులకు సంచలన ఆదేశాలు జారీ చేశారు. జులై 17 నుంచి ఇప్పటివరకు బహ్రయిచ్ జిల్లాలో ఆరు తోడేళ్లు జరిపిన దాడుల్లో దాదాపు 10 మంది ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వారిలో దాదాపు ఏడుగురు  పిల్లలే ఉండటం విషాదకరం. దాదాపు 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

We’re now on WhatsApp. Click to Join

ఈనేపథ్యంలో యూపీ అటవీ శాఖ అధికారులు ఆపరేషన్ భేడియాను ప్రారంభించి ఇప్పటివరకు నాలుగు తోడేళ్లను పట్టుకున్నారు.  మరో రెండు తోడేళ్లను పట్టుకునేందుకు సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. అయినా తోడేళ్లు అంత ఈజీగా చిక్కడం లేదు. వాటిని చంపుదామంటే వన్యప్రాణుల పరిరక్షణ చట్టాలు అడ్డొస్తున్నాయి. అందుకే ఈవిషయంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్(Shoot On Sight) జోక్యం చేసుకున్నారు. తోడేళ్లు జనావాసాల సమీపంలో కనిపిస్తే కాల్చేయాలని ఆర్డర్స్ జారీ చేశారు.

Also Read :129 Prisoner Killed : పరారీకి ఖైదీల యత్నం.. జైలులో తొక్కిసలాట.. 129 మంది మృతి

తాజాగా సోమవారం రాత్రి బహ్రయిచ్ జిల్లాలో తోడేళ్లు జరిపిన దాడిలో ఒక పసికందు చనిపోయింది. ఇద్దరు మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం వారికి ఆస్పత్రిలో చికిత్స జరుగుతోంది. తోడేళ్ల దాడుల నేపథ్యంలో బహ్రయిచ్ జిల్లాలో అడవులకు సమీపంలో ఉన్న గ్రామాల ప్రజల హడలిపోతున్నారు. రాత్రివేళ తోడేళ్లు ఎప్పుడు విరుచుకుపడుతాయో అంతుచిక్కక తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. తోడేళ్లను పట్టుకునేందుకు అటవీ శాఖ అధికారులు చాలా రకాల టెక్నిక్‌లు వినియోగిస్తున్నారు. మనిషి మూత్రంలో తడిపిన గుడ్డ పీలికలను అటవీ పరిసరాల్లో వేస్తున్నారు. వాటికి దగ్గరగా డెన్‌లను ఏర్పాటు చేస్తున్నారు.అయినా వాటిలో తోడేళ్లు చిక్కడం లేదు. తోడేళ్లు ఎప్పటికప్పుడు తమ స్థావరాలను మారుస్తున్నాయి. దీంతో వాటిని పట్టుకోవడం పెద్ద సవాల్‌గా మారింది.

  Last Updated: 03 Sep 2024, 01:49 PM IST