Site icon HashtagU Telugu

Mamata – Indira : మమతా బెనర్జీపై ఓ స్టూడెంట్ వివాదాస్పద పోస్టు.. బెంగాల్‌లో సంచలనం

Mamata Banerjee Indira Gandhi

Mamata – Indira : ‘‘మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీని కాల్చి చంపినట్టే మమతా బెనర్జీపైనా కాల్పులు జరపాలి’’ అంటూ ఓ స్టూడెంట్ తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్‌లో వివాదాస్పద పోస్టు పెట్టారు. ‘‘ఒకవేళ ఈ ప్రయత్నంలో విఫలమైనా నేనేం నిరుత్సాహపడను’’ అని సదరు సదరు స్టూడెంట్ రాసుకొచ్చారు. దీనిపై వెంటనే పోలీసులకు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు(Mamata – Indira) ఫిర్యాదు చేశారు.  దర్యాప్తు చేసిన పోలీసులు ఓ స్టూడెంట్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆ విద్యార్థిని పేరు కీర్తిశర్మ అని, బీకాం సెకండియర్ చదువుతోందని పోలీసులు వెల్లడించారు. విద్యార్థి పెట్టిన పోస్టు వర్గాల మధ్య విద్వేషాన్ని పెంచేదిగా ఉందని చెప్పారు.

We’re now on WhatsApp. Click to Join

పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో ఉన్న ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో జూనియర్ వైద్యురాలిపై ఆగస్టు 9న తెల్లవారుజామున హత్యాచారం జరిగింది. ఈ ఘటన విషయంలో సీఎం మమతా బెనర్జీని టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేసేవారిని ప్రభుత్వం గుర్తించి వారి వేళ్లు విరిచేస్తుందని పేర్కొంటూ బెంగాల్ మంత్రి ఉదయన్ గుహా సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాంటి  ఇష్టారాజ్యమైన వ్యాఖ్యలు చేసేవాళ్లే బెంగాల్‌ను బంగ్లాదేశ్‌లా మార్చేస్తారని ఆయన ఆరోపించారు. అయితే సోషల్ మీడియాలో ఈ వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

Also Read :CM Revanth : దుర్గకు మేమున్నాం.. అన్ని విధాలా సాయం చేస్తాం.. సీఎం రేవంత్ ప్రకటన

పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో ఉన్న ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో జూనియర్ వైద్యురాలిపై ఆగస్టు 9న తెల్లవారుజామున హత్యాచారం జరిగింది.  ఈ ఘటన ఇప్పుడు బెంగాల్‌లో హాట్ టాపిక్‌గా ఉంది. ఈ కేసు విషయంలో కోల్‌కతా పోలీసు కమిషనర్‌ను సీబీఐ విచారించాలంటూ డిమాండ్ చేసినందుకు  తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సుఖేందు శేఖర్‌ రాయ్‌కు సమన్లు జారీ అయ్యాయి.  ‘‘మెడికల్ కాలేజీలో జూనియర్ వైద్యురాలిపై దురాగతం జరిగి మూడు రోజులు గడిచినా.. అక్కడికి స్నిఫర్‌ డాగ్స్‌ను ఎందుకు తీసుకెళ్ల లేదు. నిజాన్ని ప్రశ్నించినందుకు నన్ను పోలీసులు విచారణకు పిలుస్తున్నారు. నన్ను అరెస్టు నుంచి రక్షించండి’’ అని కోల్‌కతా హైకోర్టులో సుఖేందు శేఖర్‌ రాయ్‌ పిటిషన్ దాఖలు చేశారు.