Shocking: ధన్‌బాద్ లో దారుణం.. 19 రోజుల్లో 50 నవజాత శిశువులు మృతి

  • Written By:
  • Publish Date - September 20, 2023 / 02:50 PM IST

జార్ఖండ్ లోని ధన్‌బాద్ జిల్లాలో దారుణ ఘటనలు వెలుగుచూస్తున్నాయి. ఎస్‌ఎన్‌ఎంఎంసిహెచ్‌లోని పీడియాట్రిక్ విభాగంలో ఈనెల 1 నుంచి 19వ తేదీ మధ్య 50 మంది నవజాత శిశువులు మృతి చెందారు. వీటిలో 0 నుండి మూడు రోజుల వరకు నవజాత శిశువులు ఉన్నారు. నవజాత శిశువులలో 70% శ్వాసకోశ సమస్యలతో బాధపడి చనిపోతున్నట్టు తెలుస్తోంది.  ఆసుపత్రిలోని ఎన్‌ఐసియులో తగినన్ని వనరులు లేకపోవడమే నవజాత శిశువుల మరణానికి కారణమని చెబుతున్నారు. అంతేకాదు.. సరిపడా వైద్యులు, సిబ్బంది లేరు.

శిశు మరణాల రేటును తగ్గించాలని ప్రభుత్వం కోరుతున్నప్పటికీ ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటుండటం గమనార్హం. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ పథకాలు కాగితాలపైనే నడుస్తున్నాయా అనే ప్రశ్న తలెత్తుతోంది. అదే సమయంలో, SNMMCH వైద్యులు పొరుగు జిల్లాల్లోని ఆసుపత్రులకు రిఫర్ చేసే ప్రమాదకరమైన ధోరణి ఉందని పేర్కొన్నారు. అప్పుడే పుట్టిన పిల్లలను వేరే ఆస్పత్రికి తరలించే సమయానికి పరిస్థితి విషమంగా మారుతూ ప్రాణాలు కోల్పోయేందుకు కారణమవుతోంది.

Also Read: Modi Tour: వచ్చే నెల తెలంగాణకు మోడీ, మహబూబ్ నగర్, నిజామాబాద్ జిల్లాల్లో పర్యటన