Site icon HashtagU Telugu

Aadhaar Card Facts: ఆధార్ కార్డు గురించి ప్రతిఒక్కరు తెలుసుకోవాల్సిన షాకింగ్ నిజాలు ఇవే!

Aadhaar Card

Aadhaar Card

భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క భారతీయుడికి ఆధార్ కార్డు తప్పనిసరి. భారతదేశంలో ఏ ప్రదేశాలకు వెళ్లినా కూడా ఆధార్ కార్డును అడుగుతూ ఉంటారు. అంతేకాకుండా ఆధార్ కార్డు మనకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ కి లింక్ అయ్యి ఉంటుంది. ఇక ఇప్పట్లో అయితే ప్రతి ఒక్క దానికి కూడా ఆధార్ కార్డు లింక్ కంపల్సరిగా ఉండాల్సిందే.

ఆధార్ కార్డులో కేవలం ఈ మాత్రమే కాకుండా, ఆధార్ కార్డు గురించి తెలుసుకోవాల్సిన ఎన్నో విషయాలు ఇంకా ఉన్నాయి. మరి ఆధార్ కార్డుకి సంబంధించిన మరికొన్ని వివరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఆధార్ కార్డులో ప్రపంచంలోనే అతిపెద్ద తొలి బయోమెట్రిక్ డేటా ఐడి గుర్తింపు వ్యవస్థ అని చెప్పవచ్చు. కాగా భారతదేశంలో ఆధార్ కార్డులను 2009 జనవరి 10 నుంచి ప్రారంభించారు. భారతదేశంలో ఈ ఆధార్ కార్డులను మొదటగా మహారాష్ట్రలోని నందర్బార్ జిల్లాలో, తెంబ్లీ గిరిజన గూడెం లో ప్రారంభించడం జరిగింది.

ఇక భారత దేశ తొలి ఆధార్ కార్డు గ్రహీత రజనా సోనవానే. ఆధార్ కార్డు చిహ్నం రూపొందించిన వారు సుధాకర్ రావు పాండే. కాగా ది యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ను ప్రస్తుతం ఆధార్ అని పిలుస్తున్నారు. ప్రతి ఒక్క ఆధార్ కార్డుకు 16 అంకెలగల కోడ్ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ప్రతి ఒక్క ఆధార్ కార్డు పై 12 అంకెలు మాత్రమే ముద్రిస్తారు. కాగా నోట్ ఆధార్ కార్డు స్లోగాన్ ఆధార్ సామాన్యుడి హక్కు. ఇక ఆధార్ టోల్ ఫ్రీ నెంబర్ 1947.

Exit mobile version