Adani : త్వరలోనే షాకింగ్ వివరాలు.. అదానీ పవర్‌కు కాంట్రాక్టుల కేటాయింపుపై కాంగ్రెస్

అదానీ పవర్(Adani) నుంచి ఒక యూనిట్ విద్యుత్‌ను రూ.4.08కి కొనుగోలు చేసేందుకు మహారాష్ట్ర స్టేట్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూటర్ ఒప్పందం కుదుర్చుకుంది.

Published By: HashtagU Telugu Desk
Congress Vs Adani Maharashtra Government

Adani : కాంగ్రెస్ పార్టీ మరోసారి అదానీ గ్రూప్‌పై సంచలన ఆరోపణలు చేసింది. మహారాష్ట్ర స్టేట్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూటర్‌కు పునరుత్పాదక విద్యుత్, థర్మల్ విద్యుత్‌లను సప్లై చేసేందుకు ఉద్దేశించిన బిడ్లను అదానీ పవర్ ఇటీవలే దక్కించుకున్న అంశాన్ని ఈసారి కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ లేవనెత్తారు.  అదానీ పవర్‌ను మరో మోదానీ ఎంటర్ ప్రైజెస్‌గా మార్చే ప్రయత్నంలో భాగంగానే మహారాష్ట్రలోని బీజేపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఆయన ఆరోపించారు. ప్రధాని మోడీకి అదానీ సన్నిహితుడనే ఉద్దేశంతోనే ఈ కాంట్రాక్టును ఆయనకు కట్టబెట్టారని పేర్కొన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు  సమీపించిన వేళ ఈ కాంట్రాక్టును అదానీ పవర్‌కు కట్టబెట్టిన అంశంతో ముడిపడిన  షాకింగ్ విషయాలను త్వరలోనే వెల్లడిస్తామని జైరాం రమేశ్ తెలిపారు. ‘‘అదానీ పవర్(Adani) నుంచి ఒక యూనిట్ విద్యుత్‌ను రూ.4.08కి కొనుగోలు చేసేందుకు మహారాష్ట్ర స్టేట్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూటర్ ఒప్పందం కుదుర్చుకుంది. జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ, టోరెంట్ పవర్ లాంటి  కంపెనీలు ఈ బిడ్ కోసం పోటీ పడినప్పటికీ అదానీ పవర్‌కే ప్రయారిటీ ఇచ్చారు’’ అని ఆయన పేర్కొన్నారు. ఈఅగ్రిమెంటులో భాగంగా అదానీ గ్రీన్ ఎనర్జీకి చెందిన గుజరాత్‌లోని ఖావ్డా రెన్యువబుల్ ఎనర్జీ పార్క్ నుంచి 5వేల మెగావాట్ల సోలార్ విద్యుత్, అదానీ పవర్ థర్మల్ ప్లాంటు నుంచి 1,496 మెగావాట్ల విద్యుత్ ‌ను మహారాష్ట్ర సర్కారుకు సప్లై చేయనున్నారు. నాలుగేళ్లలోనే ఈమేరకు విద్యుత్ సప్లైను అదానీ గ్రూప్ మొదలుపెట్టనుంది.

Also Read :Next Delhi CM : నెక్ట్స్ ఢిల్లీ సీఎం ఎవరు ? కేజ్రీవాల్ ప్రయారిటీ ఎవరికి ?

హిండెన్‌బర్గ్ ఇటీవలే ఓ నివేదికను విడుదల చేసింది.  సెబీ చీఫ్ మాధవీ పురి బుచ్‌కు అదానీ గ్రూపునకు చెందిన ఓ విదేశీ కంపెనీలో వాటాలు ఉన్నాయని తెలిపింది. దీనిపై ప్రస్తుతం దుమారం రేగుతోంది. సెబీ చీఫ్ మాధవి తన హోదాను దుర్వినియోగం చేసి కొన్ని కంపెనీల స్టాక్స్‌లో ట్రేడింగ్ చేశారని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. ఐసీఐసీఐ బ్యాంకు నుంచి కూడా సెబీ చీఫ్ శాలరీ తీసుకున్నారని అంటోంది. ఈ అంశాలపై దర్యాప్తు చేయించాలని కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది.

Also Read :CM Siddaramaiah : స్టేజీపైకి దూసుకొచ్చిన యువకుడు.. సీఎం సెక్యూరిటీ ప్రొటోకాల్‌లో లోపం

  Last Updated: 15 Sep 2024, 04:01 PM IST