Orphan Girl Gangraped : ఆగి ఉన్న బస్సులో అనాథ​పై గ్యాంగ్​రేప్​

నగరంలోని అంతర్ రాష్ట్ర బస్ టెర్మినల్ వద్ద ఆగి ఉన్న బస్సులో అనాథ టీనేజర్​పై(Orphan Girl Gangraped) సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

Published By: HashtagU Telugu Desk
Crime (1)

Orphan Girl Gangraped : కోల్‌కతాలో జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటనను మరువక ముందే మరో దురాగతం వెలుగుచూసింది. ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో ఐదుగురు దుండగులు బరితెగించారు. నగరంలోని అంతర్ రాష్ట్ర బస్ టెర్మినల్ వద్ద ఆగి ఉన్న బస్సులో అనాథ టీనేజర్​పై(Orphan Girl Gangraped) సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆగస్టు 13న జరిగిన ఈ ఘటన వివరాలు ఆలస్యంగా ఇప్పుడు వెలుగుచూశాయి. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ బృందం బాధితురాలిని రక్షించి కౌన్సెలింగ్ ఇచ్చింది. డెహ్రాడూన్‌లోని పటేల్ నగర్ పోలీస్ స్టేషన్​లో నిందితులపై కేసు నమోదైంది. ఇద్దరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకొని ఇంటరాగేట్ చేస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join

వివరాల్లోకి వెళితే.. సదరు అనాథ బాలిక పంజాబ్ వాస్తవ్యురాలు. అక్కడ ఆమె తన అక్కబావల ఇంట్లో ఉండేది. అయితే వాళ్లు  ఆమెను ఆగస్టు 11న ఇంటి నుంచి బయటికి పంపేశారు. దీంతో పంజాబ్ నుంచి ఢిల్లీకి, అక్కడి నుంచి  ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌కు చేరుకుంది. అక్కడి నుంచి ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌కు వచ్చింది. మొరాదాబాద్‌లో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ బస్సు అనుకొని ఎరుపు రంగు పెయింటింగ్ వేసి ఉన్న ఒక  బస్సులోకి ఎక్కి, ఆమె డెహ్రాడూన్‌కు చేరుకుంది. డెహ్రాడూన్‌లో బస్సు దిగే సరికే మంగళవారం తెల్లవారుజామున (ఆగస్టు 13) 2.30 గంటల సమయమైంది.

Also Read :Hussain Sagar: నిండుకుండలా ట్యాంక్ బండ్

ఆ సమయంలో అదే బస్సులో ఆ బాలికపై  ఐదుగురు వ్యక్తులు అత్యాచారం చేశారు. అనంతరం వారు అక్కడి నుంచి పరారయ్యారు. డెహ్రాడూన్ బస్టాండ్ పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు వెల్లడించారు. ఆ రోజు బస్సులు నడిచిన మార్గంలోని సీసీటీవీ ఫుటేజీని కూడా సేకరిస్తున్నామని తెలిపారు. తప్పకుండా త్వరలోనే ఈ అఘాయిత్యానికి తెగబడిన వారిని అదుపులోకి తీసుకుంటామని ప్రకటించారు.

  Last Updated: 18 Aug 2024, 12:46 PM IST