Lok Sabha polls : శివ‌రాజ్ సింగ్ చౌహాన్‌ను లోక్‌స‌భ ఎన్నిక‌ల బ‌రిలో దించేందుకు బీజేపీ క‌స‌ర‌త్తు

  • Written By:
  • Publish Date - March 1, 2024 / 05:00 PM IST

 

Lok Sabha polls : రానున్న లోక్‌స‌భ ఎన్నిక‌ల బ‌రిలో విదిశ నుంచి మ‌ధ్య‌ప్ర‌దేశ్ మాజీ సీఎం శివ‌రాజ్ సింగ్ చౌహాన్‌(Shivraj Singh Chouhan)ను దించేందుకు బీజేపీ(bjp) క‌స‌ర‌త్తు సాగిస్తోంది. ఇక మ‌ధ్య‌ప్ర‌దేశ్ నుంచి పార్టీ ప్ర‌ముఖ నేత‌లు జ్యోతిరాదిత్య‌ సింధియా, వీడీ శ‌ర్మల‌ను వ‌రుస‌గా గుణ‌, ఖ‌జ‌ర‌హో నుంచి పోటీలో నిలిపేందుకు స‌న్నాహాలు చేప‌ట్టింది.

We’re now on WhatsApp. Click to Join.

శివ‌రాజ్ సింగ్ చౌహాన్ 2023 వ‌ర‌కూ 15 ఏండ్ల పాటు మ‌ధ్య‌ప్ర‌దేశ్ సీఎంగా ప‌నిచేశారు. 2023 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త‌ను అధిగ‌మించి పార్టీని అధికారంలోకి తీసుకువ‌చ్చినా సీఎంగా నాలుగోసారి శివ‌రాజ్ చౌహాన్‌కు బీజేపీ అగ్ర నాయ‌క‌త్వం అవ‌కాశం ఇవ్వలేదు. ముఖ్య‌మంత్రిగా చౌహాన్ స్ధానంలో మోహ‌న్ యాద‌వ్ వైపు మొగ్గుచూపింది.

ప్ర‌ధాని మోడీ అధ్య‌క్ష‌త‌న గురువారం రాత్రి జ‌రిగిన బీజేపీ కేంద్ర ఎన్నిక‌ల క‌మిటీ భేటీలో 100 మంది లోక్‌స‌భ అభ్య‌ర్ధుల‌తో కూడిన తొలి జాబితాకు ఆమోద ముద్ర వేశారు. ఇక ఈ జాబితా ప్ర‌కారం ప్ర‌ధాని మోడీ వార‌ణాసి నుంచి కేంద్ర హోంమంత్రి గుజరాత్‌లోని గాంధీనగ‌ర్ నుంచి ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ లక్నో నుంచి పోటీ చేయ‌నున్నారు. ఇక 2019 లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో స్వ‌ల్ప తేడాతో పార్టీ ఓడిపోయిన స్ధానాల‌కూ ఈ జాబితాలో అభ్య‌ర్ధుల పేర్ల‌ను వెల్ల‌డించ‌నున్నారు.

read also : AP Politics : మంగళగిరిలో వైసీపీ అభ్యర్థికి గడ్డుకాలం