కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. ఓ పుస్తకం విడుదల కార్యక్రమానికి హాజరైన ఆయన…జిహాద్ అనేది ఖురాన్ లోకాదు..గీతలోనూ జీహాద్ ఉందని…బైబిల్ లోనూ ఉందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన ఈ ప్రకటన రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారమే రేపుతోంది.
జిహాద్ ఖురాన్ లోనే కాదు…గీత జీసస్ లో కూడా ఉందన్న ఆయన..ఎన్ని ప్రయత్నాలు చేసినా…ఎవరూ స్వచ్చమైన ఆలోచనలను అర్థం చేసుకోలేనప్పుడు శక్తిని ఉపయోగించాలి. మహాభారతంలోని గీత భాగంలో జీహాద్ ఉంది. మహాభారతంలో శ్రీ కృష్ణుడు అర్జునుడికి జిహాద్ పాఠాన్ని బోధించాడని తెలిపారు. అంతేకాదు క్రైస్తవులు శాంతిని నెలకొల్పేందుకు వచ్చారని..తమ వెంట కత్తు కూడా తెచ్చుకున్నారని శివరాజ్ అన్నారు. మొహసినా కిద్వాయ్ పుస్తకావిష్కరణకు వచ్చిన శివరాజ్ పాటిల్ ఈ వ్యాఖ్యలు చేవారు.
ఎన్నికలకు ముందు శివరాజ్ పాటిల్ చేసిన ఈ వ్యాఖ్యలు బీజేపీలో పెద్ద చర్చనీయాంశంగా మారాయి. బీజేపీ నేత షాజాద్ పునావాలా ట్వీట్ చేస్తూ కాంగ్రెస్ పై తీవ్రంగా మండిపడ్డారు. హిందూ ఉగ్రవాద సిద్ధాంతానికి కాంగ్రెస్ జన్మనిచ్చిందని..రామమందిరాన్ని వ్యతిరేకించిందని..దాని ఉనికినే ప్రశ్నించిందన్నారు. హిందువుల పట్ల కాంగ్రెస్ కు ఉన్న ఈ ద్వేషం ఓట బ్యాంకు రాజకీయాల కోసం అన్నారు.