Site icon HashtagU Telugu

CAA : సీఏఏను అమ‌లు చేయ‌డం వెనుక రాజ‌కీయ ప్ర‌యోజ‌నాలుః ఆనంద్ దూబే

Shiv Sena (ubt), Samajwadi

Shiv Sena (ubt), Samajwadi

 

CAA Implementation : కేంద్ర ప్ర‌భుత్వం(Central Govt)లోక్‌స‌భ ఎన్నిక‌ల‌(Lok Sabha Elections)కు ముందు సీఏఏ(CAA) నోటిఫికేష‌న్ జారీ చేయ‌డంపై శివ‌సేన (యూబీటీ) ప్ర‌తినిధి ఆనంద్ దూబే(Anand Dubey) విస్మ‌యం వ్య‌క్తం చేశారు. ప‌దేండ్ల కింద‌ట ప్ర‌వేశ‌పెట్టిన సీఏఏను ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల‌కు నాలుగు రోజుల ముందు అమ‌లు చేసేందుకు పూనుకోవ‌డంపై అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. ఈ నోటిఫికేష‌న్‌తో ఏం ఆశిస్తున్నారు..సీఏఏను అనూహ్యంగా అమ‌లు చేయ‌డం వెనుక రాజ‌కీయ ప్ర‌యోజ‌నాలు ఆశించార‌ని, ఎన్నిక‌ల కోసమే ఇదంతా చేస్తున్నార‌ని బీజేపీ(BJP)ని ఉద్దేశించి దూబే విమ‌ర్శలు గుప్పించారు.

We’re now on WhatsApp. Click to Join.

ఎన్నిక‌ల వాతావ‌ర‌ణాన్ని ప్ర‌భావితం చేసేందుకు సీఏఏ అమ‌లు ద్వారా దేశంలో అరాచ‌క ప‌రిస్దితులు నెల‌కొనేలా బీజేపీ వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని దుయ్య‌బ‌ట్టారు. ఎన్నిక‌ల్లో గెలుపు కోసం బీజేపీ ఎంత‌కైనా తెగిస్తుంద‌ని అన్నారు. ధ‌ర‌ల పెరుగుద‌ల‌, దేశంలో నిరుద్యోగం వంటి ప్ర‌దాన అంశాల‌పై బీజేపీ నోరు మెద‌ప‌ద‌ని, వారు ఇచ్చిన హామీల అమ‌లుపై ఆస‌క్తి చూప‌ర‌ని దూబే మండిప‌డ్డారు.

read also : India Counter To China : మళ్లీ పాత పాటే పాడిన చైనా..దీటుగా బదులిచ్చిన భారత్‌

రామ రాజ్యం అంటే ఏంటో బీజేపీకి తెలుసా అని ప్ర‌శ్నించారు. రాముడు తానిచ్చిన మాట కోసం అర‌ణ్య‌వాసం చేశార‌ని, కానీ బీజేపీ పాల‌కులు పార్టీల‌ను చీల్చి ప్ర‌త్య‌ర్దుల‌ను జైళ్ల‌లో పెడుతున్నార‌ని ఆందోళ‌న వ్యక్తం చేశారు. ఎన్నిక‌ల్లో గెలుపు కోసం సీఏఏను తెర‌పైకి తెచ్చార‌ని, కానీ ప్ర‌జ‌ల‌కు అన్నీ తెలుసున‌ని అన్నారు. ఇక సీఏఏ నోటిఫికేష‌న్‌పై ఎస్పీ నేత ఎస్టీ హ‌స‌న్ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. వాస్త‌వ అంశాల నుంచి ప్ర‌జ‌ల్ని ప‌క్క‌దారి ప‌ట్టించేందుకే కేంద్రం సీఏఏను తెర‌పైకి తీసుకువ‌చ్చింద‌ని దుయ్య‌బ‌ట్టారు.