Shashi Tharoor : కాంగ్రెస్ అధ్యక్ష బరిలో శశిథరూర్.. సోనియా గాంధీ అలా అన్నారా?

కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో మార్పు రాబోతోందా? గాంధీల కుటుంబం నుండి అధికారం త్వరలోనే మారుతోందా?

  • Written By:
  • Publish Date - September 19, 2022 / 10:41 PM IST

కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో మార్పు రాబోతోందా? గాంధీల కుటుంబం నుండి అధికారం త్వరలోనే మారుతోందా? అవుననే సమాధానాలు వస్తున్నాయి. గాంధీల కుటుంబ పార్టీ అనే ముద్ర నుండి కాంగ్రెస్ పార్టీ త్వరలోనే బయటకు వచ్చే ప్రయత్నాలు చేస్తోందా? అనే చర్చ దేశవ్యాప్తంగా జరుగుతోంది.

కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షులుగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు పని చేయగా.. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు కాంగ్రెస్ సీనియర్ లీడర్ శశిథరూర్ ఆసక్తి చూపుతున్నట్లు చర్చ నడుస్తోంది. ఇందుకోసం కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీగా ఉండగా.. త్వరలో కాంగ్రెస్ పార్టీకి ఎన్నికలు జరగనుండగా ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ సీనియర్ లీడర్ శశిథరూర్, సోనియా గాంధీ సమ్మతితోనే ఎన్నికల బరిలో నిలువనున్నారని తెలుస్తోంది.

గతంలో కాంగ్రెస్ ఎన్నికల గురించి సోనియా గాంధీ మాట్లాడుతూ.. ‘ఎన్నికలు అనేవి ప్రజాస్వామ్యయుతంగా జరుగుతాయి. ఎన్నికల్లో ఎవరైనా పోటీ చేయవచ్చు’ అని చెప్పడం జరిగింది. కాగా జన్ పథ్ లో సోనియా గాంధీతో భేటీ అయిన శశిథరూర్.. ‘ఎన్నికల్లో ఎవరైనా పోటీ చేయవచ్చు’ అని స్టేట్మెంట్ ఇచ్చారు.

కాగా అంతకు ముందు శశిథరూర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్లైన దీపేంద్ర హుడా, జయ ప్రకాశ్ అగర్వాల్ మరియు విజయేందర్ సింగ్ లతో కలిసి కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీతో భేటీ అయ్యారు. కాంగ్రెస్ పార్టీలో సంస్కరణలు చేయాల్సిన అవసరం ఉందని గుర్తించి ఆ పార్టీ జి-23 పేరుతో సంస్కరణ కమిటీని 23మంది కాంగ్రెస్ సీనియర్ లీడర్లో కలిపి ఏర్పాటు చేసింది. అయితే ఆ కమిటీలో లేని శశిథరూర్ ఇప్పుడు ఏకంగా కాంగ్రెస్ పార్టీ అధినేతగా ఎన్నికల బరిలో నిలుస్తున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది.