Vande Bharat Express: 25న కేరళకు వందే భారత్ ఎక్స్‌ప్రెస్

దేశంలోని వివిధ రాష్ట్రాల్లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు పరుగులు పెడుతున్నాయి. అయితే ఇంకా కొన్ని రాష్ట్రాల్లో అమలు కా లేదు.ఏప్రిల్ 25న కేరళలో వందేభారత్ రైలును మోదీ జెండా ఊపి ప్రారంభించనున్నారు

Vande Bharat Express: దేశంలోని వివిధ రాష్ట్రాల్లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు పరుగులు పెడుతున్నాయి. అయితే ఇంకా కొన్ని రాష్ట్రాల్లో అమలు కాలేదు. ఏప్రిల్ 25న కేరళలో వందేభారత్ రైలును మోదీ జెండా ఊపి ప్రారంభించనున్నారు. తమ రాష్ట్రానికి వందే భారత్ రైలు వస్తుండటంతో కేరళీయులు సంతోషపడుతున్నారు. ఇక కాంగ్రెస్ నాయకుడు శశి థరూర్ తన సంతోషాన్ని వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా శశిథరూర్ కేంద్ర ప్రభుత్వాన్ని మరియు రైల్వే మంత్రిత్వ శాఖను ప్రశంసించారు.

శశి థరూర్ తన పాత ట్వీట్లలో ఒకదాన్ని గుర్తు చేసుకుంటూ, ప్రధాని మోదీని మరియు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను ప్రశంసించారు. శశి థరూర్ కేరళలోని తిరువనంతపురం లోక్‌సభ స్థానం నుండి పార్లమెంటు సభ్యుడుగా కొనసాగుతున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కేరళలో వందే రైలు కోసం నేను 14 నెలల క్రితం ట్వీట్ చేశాను అని థరూర్ ట్వీట్‌లో తెలిపారు. అశ్విని వైష్ణవ్ సానుకూలంగా స్పందించి కేటాయించినందుకు సంతోషిస్తున్నాను. 25న తిరువనంతపురం నుంచి నరేంద్ర మోదీ ప్రారంభించే తొలి రైలు ఫ్లాగ్‌ఆఫ్‌కు హాజరయ్యేందుకు ఎదురుచూస్తున్నాను. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి జరగాలని శశిథరూర్ ఆకాంక్షించారు. వందే భారత్ రైళ్లు గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలవు.

ఏప్రిల్ 25న కేరళలో వందేభారత్ రైలును ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఈ రైలు తిరువనంతపురం స్టేషన్ నుండి ప్రారంభమై, కోజికోడ్ రైల్వే స్టేషన్‌లో ఆగుతుంది. దాదాపు 500 కిలోమీటర్ల ప్రయాణాన్ని కేవలం ఏడున్నర గంటల్లో చేరుకుంటుంది.

Read More: Mohammed Siraj: ఐపీఎల్ లో కలకలం… సిరాజ్ కు అజ్ఞాత వ్యక్తి ఫోన్ కాల్