Site icon HashtagU Telugu

Pawar shocked the Congress: కాంగ్రెస్‌కు షాకిచ్చిన పవార్‌

Sharad Pawar Questions Jpc On Hindenburg Report, Setback To Opposition unity..

Sharad Pawar Questions Jpc On Hindenburg Report, Setback To Opposition unity..

Pawar shocked the Congress : కాంగ్రెస్‌కు పెద్ద షాక్ ఇచ్చారు NCP చీఫ్‌ శరద్ పవార్‌. అదానీ వ్యవహారంలో విపక్షాల దూకుడుకు కళ్లెం వేశారు. పవార్ టోన్‌ మార్పు వెనుక అసలు రీజన్ ఏంటనేది ఆసక్తికరంగా మారింది. రాజకీయ ప్రయోజనాల కోసం పారిశ్రామికవేత్తలపై మాటలదాడి చేయడం సరికాదంటూ.. NCP అధినేత శరద్ పవార్ (Sharad Pawar) చేసిన వ్యాఖ్యలు పొలిటికల్‌ దుమారం రేపాయి. అదానీ విషయంలో విపక్షాల దూకుడును పవార్‌ కొట్టిపారేయడం సంచలనంగా మారింది.

పవార్ వ్యాఖ్యలు కాంగ్రెస్ సహా విపక్షాలకు భారీ ఝలక్‌ ఇచ్చాయి. భావసారూప్యత కలిగిన పార్టీలను ఏకతాటిపైకి తేవాలన్న హస్తం పార్టీ ప్రయత్నాలపైనా నీళ్లుజల్లినట్టైంది. మహారాష్ట్ర రాజకీయాల్లోనూ ఇది చర్చనీయాంశం అయ్యింది.శరద్ పవార్ వ్యాఖ్యలపై స్పందించిన శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం నేత సంజయ్ రౌత్‌.. విపక్ష కూటమికే తమ మద్దతని తేల్చిచెప్పారు.

మరోవైపు బీజేపీ, శివసేన బాబాసాహెబ్‌ వర్గాలు కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డాయి. అదానీ వ్యవహారంలో జేపీసీ డిమాండ్ చేయడం సమంజసం కాదని పవార్ ప్రకటన రుజువు చేసిందన్నారు మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే. రాహుల్ గాంధీ మతిభ్రమించిన ఆలోచనలను విపక్షాలు ఒక్కొక్కటిగా తిరస్కరిస్తున్నాయన్నారు బీజేపీ నేతలు. అదానీ వ్యవహారంపై జేపీసీ విచారణ డిమాండ్‌తో మలిదశ బడ్జెట్ సమావేశాలను విపక్షాలు స్థంభింపజేశాయి.

పార్లమెంట్ లోపల, వెలుపల నిరసన గళం వినిపించాయి. అయితే అదానీ, అంబానీలపై విమర్శలు తగదంటూ శరద్ పవార్ చేసిన వ్యాఖ్యలు.. విపక్ష కూటమికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చాయి. పవార్ స్వరం మార్పు వెనుక అసలు కారణం ఏంటనే చర్చ మొదలైంది. అంతేకాదు, త్వరలో విపక్షాల సమావేశం ఏర్పాటుచేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టిన కాంగ్రెస్ చీఫ్ ఖర్గే.. ఇప్పుడు పునఆలోచనలో పడ్డారనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో 2024లో మోదీ వర్సెస్ ఎవరు అనేది ప్రశ్నార్థకంగానే మిగిలింది.

Also Read:  Komati Reddy: అడగకుండా కేంద్ర నిధులు ఎలా ఇస్తుంది: కోమటిరెడ్డి