Sharad pawar: నేషనలిస్ట్‌ కాంగ్రెస్ పార్టీ కొత్త గుర్తు ఇదే..

    Sharad pawar:   ఈరోజు రాయ్‌గఢ్‌(Raigarh)లో జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి శరద్‌ పవార్‌ తన వర్గం నేషనలిస్ట్‌ కాంగ్రెస్ పార్టీ (NCP) కొత్త గుర్తును ఘనంగా లాంచ్‌ చేశారు.  ఆయన తన గుర్తును ప్రారంభించారు. ‘బూర ఊదుతున్న మనిషి’ ని పవార్‌ తన పార్టీ కొత్త గుర్తుగా ఎంచుకున్నారు. అందుకు సింబాలిక్‌గా ఇవాళ సింబల్‌ లాంచింగ్‌ కార్యక్రమంలో ప్రత్యేకంగా ఒక బృందాన్ని రప్పించి బూరలు ఊదించారు. We’re now on WhatsApp. […]

Published By: HashtagU Telugu Desk
Sharad Pawar Faction Ncp (scp) Launches Party's New Symbol 'man Blowing Tura'

Sharad Pawar Faction Ncp (scp) Launches Party's New Symbol 'man Blowing Tura'

 

 

Sharad pawar:   ఈరోజు రాయ్‌గఢ్‌(Raigarh)లో జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి శరద్‌ పవార్‌ తన వర్గం నేషనలిస్ట్‌ కాంగ్రెస్ పార్టీ (NCP) కొత్త గుర్తును ఘనంగా లాంచ్‌ చేశారు.  ఆయన తన గుర్తును ప్రారంభించారు. ‘బూర ఊదుతున్న మనిషి’ ని పవార్‌ తన పార్టీ కొత్త గుర్తుగా ఎంచుకున్నారు. అందుకు సింబాలిక్‌గా ఇవాళ సింబల్‌ లాంచింగ్‌ కార్యక్రమంలో ప్రత్యేకంగా ఒక బృందాన్ని రప్పించి బూరలు ఊదించారు.

We’re now on WhatsApp. Click to Join.

కాగా, శరద్‌ చంద్ర పవార్‌ నేతృత్వంలోని నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (NCP) ని ఆయన సోదరుడి కుమారుడు అజిత్‌పవార్‌ చీల్చాడు. తనకు అనుకూలంగా ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలతో కలిసి ఆయన బీజేపీ-ఏక్‌నాథ్‌ షిండే వర్గం శివసేనతో కలిసిపోయారు. అందుకుగాను బీజేపీ(bjp) కూటమి అజిత్‌పవార్‌కు ఉపముఖ్యమంత్రి పదవి కట్టబెట్టింది. ఈ క్రమంలో అసలైన ఎన్సీపీ తమదంటే తమదని రెండు వర్గాలు కోర్టుకు వెళ్లాయి.

రెండు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం చివరకు అజిత్‌ పవార్‌ వర్గానిదే అసలైన ఎన్సీపీగా నిర్ధారించింది. దాంతో ఎన్సీపీ పాత గుర్తు అయిన గోడ గడియారం అజిత్‌ పవార్‌ వర్గానికి సొంతమైంది. ఈ నేపథ్యంలో శరద్‌పవార్‌ వర్గం ఎన్సీపీ తన నూతన గుర్తుగా ‘బూర ఊదుతున్న మనిషి’ని ఎంపిక చేసుకుంది. ఆ మేరకు ఇవాళ సింబల్‌ లాంచ్‌ చేసింది. ఈ సింబల్‌ లాంచింగ్‌ దృశ్యాలను కింది వీడియోలో చూడవచ్చు.

read also : TDP – Janasena 1st List : టీడీపీ – జనసేన ఉమ్మడి లిస్ట్ వచ్చేసింది..

  Last Updated: 24 Feb 2024, 12:34 PM IST