Sexual Harassment: మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులు.. ధర్నాలతో దద్దరిల్లిన ఢిల్లీ!

లైంగిక వేధింపులు (Sexual Harassment) భరించలేక రెజ్లర్లు ఆందోళన బాటపట్టారు.

Published By: HashtagU Telugu Desk
Boxing

Boxing

ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. అనేక మహిళ రెజ్లర్లపై (women wrestlers) లైంగక వేధింపులు జరిగాయి. లైంగిక వేధింపులు (Sexual Harassment) భరించలేక రెజ్లర్లు ఆందోళన బాటపట్టారు. బ్రిజ్‌ హఠావో నినాదంతో ఢిల్లీలో రెజ్లర్ల ఆందోళన కొనసాగుతోంది. గురువారం సుమారు 200 మంది రెజ్లర్లు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. పలువురు అథ్లెట్లను లైంగికంగా వేధించిన రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (డబ్ల్యుఎఫ్‌ఐ) అధ్యక్షుడు, బిజెపి ఎంపి బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

బ్రిజ్‌ హఠావో అంటూ నినదిస్తున్నారు. ఏసియన్‌గేమ్స్‌, కామన్వెల్త్‌ గేమ్స్‌లలో బంగారు పతకాలను గెలుచుకున్న మొదటి భారత మహిళా రెజ్లర్‌ (women wrestlers) వినేశ్‌ ఫోగాట్‌తో పాటు సాక్షిమాలిక్‌, సంగీతా ఫోగాట్‌, సోనమ్‌ మాలిక్‌, సరితా మోర్‌, అన్షు, భజరంగ్‌ పూనియాలు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. వినేశ్‌ ఫొగాట్‌ సోదరి, రెజ్లర్‌, బిజెపి సభ్యురాలైన బబితా ఫొగాట్‌ ఈ ఆందోళనపై ట్విటర్‌లో స్పందించారు.

ఈ ఆందోళనలో తోటి రెజ్లర్‌లందరికీ (women wrestlers) అండగా ఉంటానని ట్వీట్‌ చేశారు. ఈ సమస్యను ప్రభుత్వంలో అందరి దృష్టికి తీసుకువెళ్లేందుకు యత్నిస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నానని అన్నారు. లైంగిక వేధింపుల ఆరోపణలతో జాతీయ సైక్లింగ్‌ జట్టు కోచ్‌ని తొలగించిన నెలల అనంతరం ఈ ఘటన జరగడం గమనార్హం. బ్రిజ్‌ భూషణ్‌ సహా జాతీయ శిబిరాల్లో ఏళ్ల తరబడి కొందరు కోచ్‌లు (Coaches) మహిళా రెజ్లర్‌లను లైంగికంగా వేధిస్తున్నారని, ఫిర్యాదు చేస్తే చంపేస్తామని బెదిరించారని వినేశ్‌ ఫోగాట్‌ పేర్కొన్నారు. బ్రిజ్‌ను తక్షణమే ఆ పదవి నుండి తొలగించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Also Read: Amazon Employees: అమెజాన్ హెచ్చరిక.. 2300 మంది ఉద్యోగులకు నోటీసులు!

  Last Updated: 19 Jan 2023, 03:38 PM IST