Online Prostitution : వ్యభిచార ముఠాల డిజిటల్ దందా!!

వ్యభిచార ముఠాలు కూడా డిజిటల్ పుంతలు తొక్కుతున్నాయి. డేటింగ్ యాప్ లు, సోషల్ మీడియా యాప్ లను వేదికగా చేసుకొని వల విసురుతున్నాయి. ఉద్యోగం ఇస్తామంటూ అమాయక యువతులను బంగ్లా దేశ్ నుంచి హైదరాబాద్, పరిసర ప్రాంతాలకు రప్పించి.. వారితో వ్యభిచార కేంద్రాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.

  • Written By:
  • Publish Date - May 8, 2022 / 09:20 PM IST

వ్యభిచార ముఠాలు కూడా డిజిటల్ పుంతలు తొక్కుతున్నాయి. డేటింగ్ యాప్ లు, సోషల్ మీడియా యాప్ లను వేదికగా చేసుకొని వల విసురుతున్నాయి. ఉద్యోగం ఇస్తామంటూ అమాయక యువతులను బంగ్లా దేశ్ నుంచి హైదరాబాద్, పరిసర ప్రాంతాలకు రప్పించి.. వారితో వ్యభిచార కేంద్రాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. డేటింగ్ యాప్ లలో ఆ అమ్మాయిల ఫేక్ ప్రొఫైల్స్ తో అకౌంట్స్ తెరిపించి.. ఇతరులపై వల విసిరే పనిలో పెడుతున్నాయి. ఈ బంగ్లాదేశీ అమ్మాయిలను పశ్చిమ బెంగాల్ సరిహద్దుల మీదుగా భారత్ లోకి అక్రమంగా తీసుకొస్తున్నారని సమాచారం. ఈఏడాది ఇటువంటి 30 కేసులను తెలంగాణలోని రాచకొండ పోలీసులు గుర్తించారు. ఇలాంటి ముఠాల ఆట కట్టించడంపై రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలోని యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ (ahtu) ప్రత్యేక దృష్టి సారించింది .

దందా ఇలా సాగుతోంది..

డేటింగ్ యాప్ నుంచి ఆ వ్యభిచార ముఠాకు ఎవరైనా కాల్ చేస్తే.. అతడు నిజమైన కష్టమరా ? కాదా? అనేది తొలుత ధృవీకరించుకుంటారు. ఆ తర్వాత ఒక హోటల్ లో రూమ్ ను బుక్ చేసి అక్కడికి వెళ్ళమని సూచిస్తారు. డబ్బులు నేరుగా యువతికి ఇచ్చేయాలని చెబుతారు. ఎంత ఇవ్వాలి అనేది కూడా ఫోన్ కాల్ లొనే చెప్పేస్తారు. ఉద్యోగాల పేరుతో బంగ్లాదేశీ యువతులను మోసపూరితంగా వ్యభిచార ఊబిలోకి లాగుతూ , వారి ప్రాణాలతో ముఠాలు చెలగాటం ఆడుతున్నాయి. వాటికి చెక్ పెట్టె దిశగా అడుగులు పడాల్సిన అవసరం ఉంది.