Delhi: 2024 సంవత్సరానికి ఢిల్లీ ప్రజలు వెల్ కమ్ చెప్పారు. అయితే మొదటి రోజే పొగమంచు స్వాగతం పలికింది. భారత వాతావరణ శాఖ (IMD) ప్రకారం.. నగరంలో కనిష్ట ఉష్ణోగ్రత 10.1 డిగ్రీల సెల్సియస్‌గా ఉంది, ఇది కాలానుగుణ సగటు కంటే మూడు రెట్లు ఎక్కువగా ఉంది. దృశ్యమానతను ప్రభావితం చేసే పొగమంచుతో దేశ రాజధానిని కప్పేసింది. సఫ్దర్‌జంగ్‌లో అత్యల్పంగా 700 మీటర్ల వద్ద ఉదయం 7 గంటలకు నమోదైంది. అదే సమయంలో పాలం లో 1,100 మీటర్ల విజిబిలిటీని ఉంది.
ఇండియన్ రైల్వేస్ ప్రకారం, ముంబై-ఫిరోజ్‌పూర్, బెంగళూరు-నిజాముద్దీన్ రాజధాని, హైదరాబాద్-న్యూఢిల్లీ సహా 21 రైళ్లు దృశ్యమానత సరిగా లేకపోవడంతో గంటల కొద్దీ ఆలస్యంగా నడిచాయి. అయితే, దేశ రాజధానిలోని గాలి నాణ్యత ‘చాలా పేలవమైన’ కేటగిరీలో ఉంది. అయితే ఢిల్లీలో తీవ్రమైన మంచు ఏర్పడటంతో ఇటు రైళ్లు, ప్రయాణాల రాకపోకలపై తీవ్ర ప్రభావం పడింది. కొన్ని చోట్లా రాకపోకలు ఆలస్యంగా నడుస్తున్నాయి. న్యూ ఇయర్ వేళ ఢిల్లీపై పొగ మంచు ప్రభావం పడటంతో చాలామంది వేడుకలకు దూరంగా ఉండిపోయారు.