BJP : బీజేపీ 17వ జాబితా విడుదల

ఈ లిస్ట్ లో తండ్రుల స్థానంలో కొడుకులకు ఛాన్స్ ఇచ్చి పెద్ద పీఠం వేసింది

  • Written By:
  • Publish Date - May 2, 2024 / 08:54 PM IST

లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో బిజెపి (BJP) గురువారం 17 వ జాబితాను రిలీజ్ చేసింది. ఈ లిస్ట్ లో తండ్రుల స్థానంలో కొడుకులకు ఛాన్స్ ఇచ్చి పెద్ద పీఠం వేసింది. రాయ్‌బరేలీ నుండి దినేష్ ప్రతాప్ సింగ్‌, కైసర్‌గంజ్ నుండి రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ (Brij Bhushan) కుమారుడు కరణ్ భూషణ్‌కు (Karan Bhushan) టికెట్స్ ఇచ్చింది.

We’re now on WhatsApp. Click to Join.

ఇక ఇప్పటికే రెండు దశల్లో ఎన్నికలు పూర్తి కాగా… మూడో దశలో మే 7వ తేదీన 94 స్థానాలకు పోలింగ్‌ జరగనుంది. మే 13వ తేదీన నాల్గవ దశలో 96 లోక్‌సభ స్థానాలపై ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఐదో దశ మే 20వ తేదీన (49 లోక్‌సభ స్థానాలకు), ఆరో దశ మే 25వ తేదీన, ఏడో దశ జూన్ 1వ తేదీన పోలింగ్ జరగనున్నాయి. చివరి రెండు దశల్లో కలుపుకుని 57 స్థానాలకు పోలింగ్‌ జరగనుంది. వీటి అన్నింటికీ సంబదించిన ఫలితాలు జూన్ 04 న రాబోతున్నాయి.

Read Also : AP : ఉద్యోగులకు జగన్ భారీ షాక్ ..