Seven Dead : ఘోర అగ్నిప్రమాదం.. ఏడుగురి సజీవ దహనం

Six Dead : కొవ్వొత్తుల తయారీ పరిశ్రమలో ఘోర అగ్నిప్రమాదం సంభవించి ఏడుగురు సజీవ దహనమయ్యారు.

Published By: HashtagU Telugu Desk
China Explosion

Bomb blast

Seven Dead : కొవ్వొత్తుల తయారీ పరిశ్రమలో ఘోర అగ్నిప్రమాదం సంభవించి ఏడుగురు సజీవ దహనమయ్యారు. మరో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. మహారాష్ట్రలోని పూణె జిల్లా పింప్రి చించ్‌వాడ్‌లోని తలవాడే ప్రాంతంలో ఉన్న కొవ్వొత్తుల తయారీ యూనిట్‌లో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.  అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలికి చేరుకొని మంటలను ఆర్పేశారు. అయితే అగ్ని ప్రమాదం ఎలా జరిగిందనే విషయం ఇంకా తెలియరాలేదు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రిలో చేర్పించారు.

We’re now on WhatsApp. Click to Join.

ప్రమాదం  జరిగిన కొవ్వొత్తుల తయారీ యూనిట్‌లో మెరుపులు వెదజల్లే కొవ్వొత్తులను తయారు చేస్తుంటారు. వీటిని పుట్టినరోజు వేడుకల్లో స్పెషల్‌గా వాడుతుంటారు. శుక్రవారం మధ్యాహ్నం 2.45 గంటలకు అగ్ని ప్రమాదం గురించి తమకు కాల్ ద్వారా సమాచారం అందిందని పింప్రి-చించ్వాడ్ మున్సిపల్ కమిషనర్ శేఖర్ సింగ్ తెలిపారు.ఇక గాయాలతో ఆస్పత్రిలో చేరిన ఎనిమిది మంది కుటుంబాలు తీవ్ర ఆందోళనలో ఉన్నాయి. వారి శరీరాలు కూడా ఈ అగ్నిప్రమాదంలో బాగా కాలిపోయాయని(Seven Dead) తెలుస్తోంది.

Also Read: UPI Auto Payment: యూపీఐ చెల్లింపుల పరిమితి పెంచుతూ కీలక నిర్ణయం తీసుకున్న ఆర్బీఐ?

  Last Updated: 08 Dec 2023, 06:15 PM IST