సీరం ఇన్సిట్యూట్ అఫ్ ఇండియా పిల్లలకు ఆరు నెలల్లో కవిడ్ వాక్సిన్ ను (COVOVAX) అందుబాటులోకి తేనున్నట్లు ఆ కంపెనీ సీఈఓ ఆధార్ పూనావాలా అన్నారు. మంగళవారం నిర్వహించిన ఓ కార్యక్రమం లో అయన మాట్లాడుతూ.. ” అదృష్టవశాత్తు కరోనా వైరస్ పిల్లలో అంత ప్రభావం చూపలేదు. కానీ.. సీరం ఇన్సిట్యూట్ అఫ్ ఇండియా త్వరలో పిల్లలకు కూడా వాక్సిన్ అందుబాటులోకి తెస్తుంది ప్రస్తుతం చివరి దశ ట్రైల్స్ లో ఉందని ” అని అన్నారు.
ఓమిక్రాన్ వేరియెంట్ పై అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ… పిల్లలో ఎంతవరకు దాని ప్రభావం ఉంటుందో ఇప్పుడే చెప్పలేమని, ఒకవేళ వైరస్(COVID) సోకినా.. పిల్లలో ఉండే సాధారణ రోగనిరోధక శక్తి వలన వారు త్వరగా కోలుకునే అవకాశాలు ఎక్కువ అని పూనావాలా అన్నారు. ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన వాక్సిన్ లను ప్రతి ఒక్కరు తీసుకోవాలని వాటి వలన ఎవరికీ కూడా హాని కలుగదని.. వైరస్ కు ధీటుగా ఈ వాక్సిన్ లు పనిచేస్తాయి అని అయన సూచించారు.