Amritpal Singh : ఎన్నికల బరిలో ఖలిస్థాన్ వేర్పాటువాది.. జైలు నుంచే పోటీ !

Amritpal Singh : అమృత్ పాల్ సింగ్.. మన దేశంలోని పంజాబ్ కేంద్రంగా ఖలిస్థానీ ఉగ్రవాదాన్ని పెంచి పోషించిన కరుడుగట్టిన టెర్రరిస్ట్.

  • Written By:
  • Updated On - April 25, 2024 / 11:07 AM IST

Amritpal Singh : అమృత్ పాల్ సింగ్.. మన దేశంలోని పంజాబ్ కేంద్రంగా ఖలిస్థానీ ఉగ్రవాదాన్ని పెంచి పోషించిన కరుడుగట్టిన టెర్రరిస్ట్. ప్రస్తుతం ఈ ఉగ్రవాది అసోంలోని దిబ్రూగడ్ జైలులో ఉన్నాడు.  టెర్రరిస్ట్ అమృత్ పాల్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. జైలు నుంచే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించాడు.  పంజాబ్‌లోని ఖదూర్ సాహిబ్ నియోజకవర్గం నుంచి స్వత్రంత్య అభ్యర్థిగా అమృత్ పాల్ పోటీ చేయనున్నాడు. త్వరలోనే అతడు నామినేషన్ కూడా దాఖలు చేస్తాడని తెలుస్తోంది. ఖదూర్ సాహిబ్ సెగ్మెంట్‌లో జూన్ 1న పోలింగ్ జరగనుంది. ఈవివరాలను స్వయంగా  అమృత్ పాల్ తరఫు న్యాయవాది రాజ్ దేవ్ సింగ్ ఖల్సా మీడియాకు వెల్లడించారు. అమృత్ పాల్‌ను తాను బుధవారం రోజు జైలులో కలిసినప్పుడు ఈవివరాలు చెప్పారని పేర్కొన్నారు.

We’re now on WhatsApp. Click to Join

ఈ అంశంపై అమృత్ పాల్ సింగ్ తండ్రి టార్సెమ్ సింగ్ స్పందిస్తూ..  ‘‘అమృత్ పాల్‌ను నేను చాలా కాలంగా కలవలేదు. ఎన్నికల్లో అతడు పోటీ చేస్తున్న విషయం నాకు తెలియదు. అమృత్ పాల్‌ను(Amritpal Singh) కలిశాక.. అతడిని తెలుసుకొని మీకు చెబుతా’’ అని  స్పష్టం చేశారు. గతేడాది అమృత్ పాల్ సింగ్, అతడి మద్దతు దారులు కత్తులు, తుపాకులతో అమృత్‌సర్ నగర శివార్లలోని పోలీస్ స్టేషన్‌లోకి చొరబడి విధ్వంసానికి తెగబడ్డారు. దీంతో అక్కడి ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. అప్పట్లో తమ సహచరుడు లవ్ ప్రీత్ సింగ్‌ను విడుదల చేయాలని అమృత్ పాల్‌ డిమాండ్ చేశాడు. ఈ పరిణామాల తర్వాత అమృత్ పాల్‌ మాయమయ్యాడు. చాలా రోజుల పాటు గాలించిన పోలీసులు..  చివరకు 2023 ఏప్రిల్ 23న  పంజాబ్​లోని మోగా జిల్లాలో అతడిని అరెస్టు చేశారు. అమృత్‌పాల్‌పై నేషనల్‌ సెక్యూరిటీ యాక్ట్‌ కింద కేసు నమోదు  చేశారు. ఆ తర్వాత అసోంలోని దిబ్రూగఢ్ జైలుకు తరలించారు. తన కుమారుడిని పంజాబ్​ జైలుకు తరలించాలని అమృత్​పాల్ సింగ్ తల్లి బల్వీందర్​ కౌర్‌ డిమాండ్ చేశారు.  ఈ డిమాండ్‌తో కౌర్​ ర్యాలీ చేపట్టేందుకు యత్నించగా  పోలీసులు అరెస్టు చేశారు.

Also Read :Actress Tamannaah : హీరోయిన్ తమన్నాకు సైబర్ క్రైమ్ పోలీసుల నోటీసులు

ఎవరీ అమృత్​పాల్?

  • కొన్నేళ్ల క్రితం అమృత్​పాల్ తన బంధువుల రవాణా బిజినెస్​లో మద్దతుగా ఉండేందుకు దుబాయ్​కు వెళ్లాడు.
  • అతడు సోషల్ మీడియాలో టైం పాస్ చేసేవాడు.
  • వారిస్ పంజాబ్ దే వ్యవస్థాపకుడు, నటుడు దీప్​ సిద్ధూ మరణం అమృత్​పాల్ జీవితాన్ని మార్చేసింది.
  • దీప్​ సిద్ధూ అనుచరులకు గైడెన్స్ చేసే బాధ్యతను అమృత్​పాల్ తీసుకున్నాడు.
  • వారిస్ పంజాబ్ దే సంస్థకు అధినేతగా తన పేరును అతడు ప్రకటించుకున్నాడు.అమృత్​పాల్ కుటుంబ సభ్యులు కూడా ఇందుకు ఒప్పుకోలేదు.
  • అతడిపై నిఘా పెట్టిన భారత ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు అమృత్​పాల్​కు ఐసిస్​తోనూ సంబంధాలు ఉన్నాయని గుర్తించాయి.