Site icon HashtagU Telugu

Delhi Police : నూపుర్ శర్మ దరఖాస్తుపై ఢిల్లీ పోలీసుల సంచలన నిర్ణయం

Sensational decision of Delhi Police on Nupur Sharma's application.

Nuper Sarma

ఓ టీవీ చర్చా కార్యక్రమంలో మహమ్మద్ ప్రవక్త (Prophet Muhammad)పై వ్యాఖ్యలు చేసిన బీజేపీ (BJP) మాజీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మ (Nupur Sharma)కు ఢిల్లీ పోలీసులు (Delhi Police) శుభవార్త చెప్పారు. తన భద్రతకు ముప్పు ఉన్నందువల్ల వ్యక్తిగతంగా తనతోపాటు ఓ తుపాకీని తీసుకెళ్ళేందుకు అనుమతి ఇవ్వాలని ఆమె చేసిన దరఖాస్తుపై సానుకూలంగా స్పందించారు. ఆమెకు గన్ లైసెన్స్‌ను మంజూరు చేశారు. ఈ విషయాన్ని ఢిల్లీ పోలీసు అధికారి ఒకరు ధ్రువీకరించారు.

జ్ఞానవాపి కేసు విచారణ సమయంలో నూపుర్ శర్మ గత ఏడాది ఓ టీవీ చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆమె మహమ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలపై అంతర్జాతీయ స్థాయిలో దుమారం రేగింది. దీంతో ఆమెను బీజేపీ సస్పెండ్ చేసింది. అనంతరం ఆమె తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు. తన వ్యాఖ్యలు మతపరమైన మనోభావాలను గాయపరచేందుకు కాదని, శివలింగాన్ని ఎగతాళి చేస్తూ ఓ ప్యానెలిస్ట్ మాట్లాడటంతో తాను తిప్పికొట్టడం కోసమే ఆ వ్యాఖ్యలు చేశానని తెలిపారు. అయినప్పటికీ ముస్లింలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. గత ఏడాది జూలైలో సుప్రీంకోర్టు ఆమెపై ఘాటు వ్యాఖ్యలు చేసింది. దేశంలో జరుగుతున్నదానికి ఆమె మాత్రమే బాధ్యురాలని స్పష్టం చేసింది..

తనకు వ్యక్తిగత తుపాకీ లైసెన్స్ మంజూరు చేయాలని నూపుర్ శర్మ ఢిల్లీ పోలీసులకు (Delhi Police) దరఖాస్తు చేశారు. ఆమె భద్రతకు ముప్పు ఉన్నట్లు గుర్తించిన ఢిల్లీ పోలీసులు ఆమె దరఖాస్తుకు ఆమోదం తెలిపారు. వ్యక్తిగతంగా తుపాకీని తీసుకెళ్లేందుకు ఆమెకు అనుమతి ఇచ్చారు.

Also Read:  Double Decker E-Buses : హైదరాబాద్ కు మళ్ళీ డెక్కర్‌ ఈ – బస్సులు!